నవ దంపతుల ఆత్మహత్య

23 Nov, 2023 08:17 IST|Sakshi

అనంతపురం: నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మండలంలోని గంగంపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ జనార్దన్‌ నాయుడు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల దాదాఖలందర్‌ (24), బోయ జ్యోత్స (20) రెండు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

ఏం జరిగిందో తెలియదు కానీ, ఇద్దరూ ఇంట్లో బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ జనార్దన్‌ నాయుడు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు