పవన్‌కు మెంటల్‌ బ్యాలెన్స్‌ తప్పింది.. జనసేన క్యాడర్‌ను చంద్రబాబుకు తాకట్టుపెట్టాడు: ఎమ్మెల్యే మల్లాది

13 Jan, 2023 10:53 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని 175 సీట్లలో ఒంటరిగా చేస్తానని చెప్పే దమ్ము పవన్‌ కల్యాణ్‌కు ఉందా? అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. శ్రీకాకుళం యువశక్తి సభలో జనసేనాని చేసిన ప్రసంగంపై సాక్షి టీవీతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లాది తీవ్రంగా స్పందించారు.

‘‘పవన్ యువశక్తి సభలో అసభ్యంగా మాట్లాడాడు.  సీఎం జగన్‌ను విమర్శించే అర్హత అసలు పవన్‌కు ఉందా?. సజ్జల , మంత్రుల గురించి మాట్లాడే స్థాయి ఉందా?..  బాంచన్ దొర అంటూ చంద్రబాబు కాళ్ల దగ్గర చేరావు.  ఊడిగం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చావు’ అని మల్లాది మండిపడ్డారు. 

‘పవన్ కల్యాణ్‌కు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది. ఎవడితో ఉంటావో తెలియని నువ్వు.. ఎవరితో పోరాటం చేస్తావు?. జనసేన , వీర మహిళలను చంద్రబాబుకు పవన్ తాకట్టు పెట్టాడు. తన సభకు వచ్చిన అభిమానులను , జనసేన శ్రేణులను పవన్ అవమానిస్తూ వస్తున్నాడు. రెండు చోట్ల ఓడిపోయింది నిజం కాదా?. మంత్రి రోజా మాట్లాడిన మాటల్లో తప్పేముంది?’ అని ఎమ్మెల్యే మల్లాది మండిపడ్డారు. 

‘సీఎం జగన్‌ను విమర్శించడమంటే.. ఆంధ్రరాష్ట్ర ప్రజలను అవమానపరచడమే. రాష్ట్ర విభజన సమయంలో కూడా నువ్వు రాజకీయాల్లోనే ఉన్నావ్ కదా. మరి అప్పుడెందుకు చంద్రబాబుకు మద్దతిచ్చావు?. సభలు సమావేశాల్లో తిట్టడం కాదు.. విడివిడిగా వస్తారో అంతా కలిసి వస్తారో 2024లో చూసుకుందాం అని ఎమ్మెల్యే మల్లాది, పవన్‌కు సవాల్‌ విసిరారు.

మరిన్ని వార్తలు