Actor Karthi: జపాన్‌ డిజాస్టర్‌తో కీలక నిర్ణయం తీసుకున్న కార్తి

17 Nov, 2023 13:04 IST|Sakshi

కోలివుడ్‌లో కార్తి సినిమా అంటే  మినిమమ్‌ గ్యారెంటీ అనే గుర్తింపు ఉంది. తాజాగా ఆయన నటించిన జపాన్ సినిమా దీపావళి కానుకగా విడుదలైంది. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. స్క్రీన్‌ప్లే, మేకింగ్ విషయంలో సినిమా పూర్తిగా ఫెయిల్‌ అయిందని టాక్‌ రావడం వల్ల  జపాన్‌కు వ్యతిరేక రివ్యూలు వచ్చాయి. దీంతో  జపాన్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో కార్తీ కీలక నిర్ణయం తీసుకుని తదుపరి దశకు సిద్ధమయ్యాడు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు)

నవంబర్‌ 10వ తేదీన విడుదలైన జపాన్‌  ఇప్పటి వరకు  వరల్డ్ వైడ్‌గా రూ. 23.34 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 12.15 కోట్లు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. సుమారు రూ. 27 కోట్లకు పైగా నష్టం రావచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కార్తి కెరియర్‌లో బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా జపాన్‌ నిలిచింది. కార్తికి 25వ సినిమాగా జపాన్‌ విడుదలైంది. మొదటి ఆట నుంచే నెగిటివ్‌గా ట్రోల్స్‌ రావడంతో కార్తీ కూడా కీలక నిర్ణయం తీసుకుని అందుకు తగ్గట్టుగానే తన 27వ సినిమా షూటింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. కోలివుడ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అయిన '96'తో ఫేమస్‌  అయిన డైరెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌తో సినిమా షూటింగ్‌ను నేడు ప్రారంభించనున్నాడు.  ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డి సంస్థ నిర్మిస్తోంది.

ఈ సందర్భంలో, కార్తీ 27 షూటింగ్ నేటి నుంచి కుంభకోణంలో ప్రారంభమవుతుంది. ఇందులో కార్తీతో పాటు అరవింద్ సామీ కూడా నటించనున్నాడని సమాచారం. ఈరోజు ప్రారంభం కానున్న షూటింగ్ కూడా శరవేగంగా జరగనుందని అంటున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో కార్తీ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరోవైపు నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ 26లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్న కార్తీ.. జపాన్‌తో వచ్చిన డ్యామేజిని కంట్రోల్‌ చేసే పనిలో కార్తి ఉన్నాడని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు