ఘనంగా పెద్దపీరయ్యస్వామి ఆరాధన

22 Mar, 2023 23:56 IST|Sakshi
విద్యుత్‌ దీప అలంకరణలో సిద్దయ్యమఠం

బ్రహ్మంగారిమఠం : పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ప్రియ శిష్యుడు ముడుమాల సిద్దయ్య పెద్దకుమారుడు పెద్దపీరయ్యస్వామి ఆరాధన మహోత్సవాలు బుధవారం సిద్దయ్యమఠంలో మఠం నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా ప్రతి ఏడు పెద్దపీరయ్యస్వామి ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలలనుంచే కాకుండా ఇతర జిల్లాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని ముడుమాల, జౌకుపల్లె, కేశాపురం, చెంచయ్యగారిపల్లె, చిన్నాయపల్లె, ఎర్రంపల్లె, అమగంపల్లె, ఇటుగుల్లపాడు తదితర గ్రామాలనుంచి స్వామి దీపారాధనకోసం నూనె డబ్బాలతో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మైదుకూరుకు చెందిన భక్తులు ఉచితంగా వాహనాలను ఏర్పాటు చేశారు. వివిధ కులాలకు చెందిన వారు సిద్దయ్యమఠంలో అన్నదానం ఏర్పాటు చేశారు. బి.మఠం ఎస్‌ఐ విద్యాసాగర్‌ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నేడు బండలాగుడు పోటీలు..

పెద్దపీరయ్య ఆరాధన మహోత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం బండలాగుడు పొటీలు నిర్వహించనున్నారు. మొదటి బహుమతి రూ.75 వేలు జెడ్పీటీసీ ఎం రామగోవిందరెడ్డి ఇవ్వనున్నారు. రెండవ బహుమతి రూ. 50 వేలు సిద్దయ్యమఠం నిర్వాహకులు, మూడవ బహుమతి రూ. 30 వేలు ఏఈ రామసుబ్బారెడ్డి బ్రదర్స్‌ ఇవ్వనున్నారు.

స్వామి దర్శనంకోసం

బారులు తీరిన భక్తులు

మరిన్ని వార్తలు