క్యాంబెల్‌: ఇద్దరు సీఎంలు జన్మించిన ఆసుపత్రి

8 Oct, 2021 21:30 IST|Sakshi

రాయలసీమలో మొదటి పెద్దాసుపత్రి క్యాంబెల్‌

వైఎస్సార్‌జిల్లా (జమ్మలమడుగు) : రాయలసీమ ప్రాంతంలో మొదటి ప్రజా సేవకోసం ఏర్పాటు చేసిన వైద్యశాల క్యాంబెల్‌ వైద్యశాల.1896లో లండన్‌ మిషనరీ ఆధ్వర్యంలో డాక్టర్‌ క్యాంబెల్‌ రోగులకు వైద్య సేవలు చేయడం కోసం ఆసుపత్రిని ప్రారంభించారు. నాటి నుంచి ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ రాయలసీమలో పెద్దాసుపత్రిగా పేరుగాంచడంతో అనంతపుర,కర్నూల్‌ కడప తదితర ప్రాంతాలనుంచి రోగులు వైద్యం కోసం వచ్చెవారు. దాదాపు 75 సంవత్సరాల పాటు తన వైభవాన్ని చాటుకుంది. ప్రస్తుతం ఈ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందుతుంది.

ఇద్దరు ముఖ్యమంత్రులు జన్మించిన ఆసుపత్రి...
జమ్మలమడుగులోని క్యాంబెల్‌ఆసుపత్రిలో ఇద్దరు ముఖ్యమంత్రులు జన్మించారు. వైఎస్‌ రాజరెడ్డి, జయమ్మ దంపతులకు కుమారుడైన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జన్మించింది క్యాంబెల్‌ ఆసుపత్రిలోనే. అంతేకాకుండ ఆయన వైద్య వృత్తిని పూర్తి చేసుకోని ఒక ఏడాది పాటు క్యాంబెల్‌ ఆసుపత్రిలో డాక్టర్‌గా కూడా రోగులకు వైద్యం అందించారు. అంతేకాకుండ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, విజయమ్మ దంపతుల సంతానం.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కుమార్తె వైఎస్‌ షర్మిల కూడా క్యాంబెల్‌ ఆసుపత్రిలోనే జన్మించారు.
 

మరిన్ని వార్తలు