5 కోట్ల కరెన్సీ నోట్లు.. కిలోల కొద్ధీ బంగారు, వెండితో అమ్మవారి అలంకరణ

11 Oct, 2021 20:39 IST|Sakshi

వాసవీమాత ఆలయానికి దసరా శరన్నవరాత్రి శోభ

రూ.5 కోట్ల కరెన్సీ, 7 కేజీల బంగారం, 60 కిలోల వెండితో ముస్తాబు

సింహపురి సీమలో వెలుగు కాంతుల నడుమ ఆర్యవైశ్యుల ఇలవేల్పు

నెల్లూరు(బృందావనం): కోట్ల రూపాయల కొత్త కరెన్సీ రెపరెపల తోరణాలు.. కిలోల కొద్ది బంగారు, వెండి బిస్కెట్లు.. విద్యుద్దీప కాంతుల నడుమ సింహపురి సీమలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు.

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నుడా చైర్మన్, ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘీయులు, భక్తుల సహకారంతో ఐదోరోజు సోమవారం శ్రీవాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారిని, ఆలయాన్ని రూ.ఐదు కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, రూ.3.5కోట్ల విలువైన ఏడు కిలోల బంగారు బిస్కెట్లు, రూ.3.5 కోట్ల విలువైన 60 కిలోల వెండిబిస్కెట్లు, ఆభరణాలతో అలంకరించారు.
(చదవండి: ఏపీపీఎస్సీలో 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు)

ఇందుకోసం మహబూబునగర్‌ జిల్లా బందరుకు చెందిన వేమూరిచంద్రశేఖర్‌ నేతృత్వంలో 120 మంది నిపుణులు పనిచేసి అమ్మణ్ణి ఆలయానికి మరింత శోభను సంతరింపజేశారని ముక్కాల ద్వారకానాథ్‌ వివరించారు. ఈ సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు బారులుతీరారు.


(చదవండి: కర్రల సమరం: ‘గట్టు’ మీద ఒట్టు! )

Read latest Ap-special News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు