ఈ రాశివారికి ఆస్తి వివాదాలు తీరతాయి

1 May, 2021 06:19 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.పంచమి రా.10.17 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం మూల ప.3.30 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం ప.2.01 నుంచి 3.30 వరకు, తిరిగి రా.12.39 నుంచి 2.10 వరకు, దుర్ముహూర్తం ఉ.5.38 నుంచి 7.18 వరకు అమృతఘడియలు... ఉ.9.30 నుంచి 10.56 వరకు.

సూర్యోదయం :    5.39
సూర్యాస్తమయం    :  6.15
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు:

మేషం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. మిత్రులతో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం. 

వృషభం: ఆర్థికాభివృద్ధి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

మిథునం: ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. సోదరులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. 

సింహం: మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువర్గం నుంచి కీలక సమాచారం. ఆస్తి వివాదాలు. వృత్తి,వ్యాపారాలు నిరుత్సాహం. 

కన్య: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. భూ, గృహయోగాలు. పలుకుబడి పెరుగుతుంది.  వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. 

తుల: బంధువులు, మిత్రులతో వివాదాలు. శ్రమాధిక్యం. శ్రమ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు. వృత్తి,వ్యాపారాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు. ఆధ్యాత్మిక చింతన అనారోగ్యం. 

వృశ్చికం: సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పనులలో పురోగతి. కాంట్రాక్టులు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. దైవదర్శనాలు. 

ధనుస్సు: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఇంటాబయటా అనుకూలం. 

మకరం: పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. 

కుంభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహన యోగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. 

మీనం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. పుణ్యక్షేత్రాల సందర్శనం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. 
 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు