ఈ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

14 May, 2021 06:22 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.తదియ తె.5.01 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి చవితి, నక్షత్రం మృగశిర పూర్తి (24 గంటలు) వర్జ్యం ఉ.9.58 నుండి 11.45 వరకు, దుర్ముహూర్తం ఉ. 8.05 నుండి 8.55 వరకు, తదుపరి ప.12.20 నుండి 1.11 వరకు అమృతఘడియలు... రా.8.31 నుండి 10.17 వరకు, అక్షయతృతీయ.

సూర్యోదయం :    5.32
సూర్యాస్తమయం    :  6.19
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

వృషభం: శ్రమ ఫలిస్తుంది. నూతన విషయాలు లె లుసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. పరిచయాలు విస్తృతవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం: ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వృత్తి,వ్యాపారాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

సింహం: ఉద్యోగయత్నాలు సానుకూలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

కన్య: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.

తుల: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు: కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

మకరం: పనుల్లో జాప్యం. రుణాలు చేస్తారు. మిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు పనిభారం.

కుంభం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. మిత్రులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

మీనం: యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు