ఈ రాశి వారికి ఆస్తి వివాదాలు

20 Feb, 2021 06:33 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి శు.అష్టమి ఉ.11.02 వరకు తదుపరి నవమి, నక్షత్రం రోహిణి పూర్తి (24 గంటలు) వర్జ్యం రా.9.34 నుంచి 11.20 వరకు దుర్ముహూర్తం ఉ.6.28 నుంచి 8.00 వరకు అమృతఘడియలు... రా.2.54 నుంచి 4.36 వరకు.

సూర్యోదయం :    6.29
సూర్యాస్తమయం    :  5.59
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు:
మేషం: బంధువర్గంతో అనుకోని వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

వృషభం: బంధువులతో సఖ్యత. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. .

మిథునం: మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. పనులలో జాప్యం. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో చికాకులు.

కర్కాటకం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

సింహం: నూతన వ్యక్తులతో పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం పొందుతారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 

కన్య: శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆత్మీయులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వృత్తి,వ్యాపారాలు సామాన్యం. ఆకస్మిక ప్రయాణాలు.

తుల: పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు. సోదరులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ప్రయాణాలు వాయిదా పడతాయి.

వృశ్చికం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ముఖ్య నిర్ణయాలు.

ధనుస్సు: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

మకరం: సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం.  కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. 

కుంభం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

మీనం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి సహాయం. ఆస్తి వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.
 

మరిన్ని వార్తలు