గ్రహం అనుగ్రహం (23-11-2020) 

23 Nov, 2020 06:20 IST|Sakshi

శ్రీ శార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. కార్తీక మాసం. తిథి శు.నవమి రా.2.50 వరకు, తదుపరి దశమి. నక్షత్రం శతభిషం సా.4.23 వరకు, తదుపరి పూర్వాభాద్ర. వర్జ్యం రా.11.12 నుంచి 12.55 వరకు. దుర్ముహూర్తం ప.12.07 నుంచి 12.51 వరకు, తదుపరి ప.2.20 నుంచి 3.06 వరకు. అమృత ఘడియలు ఉ.8.50 నుంచి 10.30 వరకు.

సూర్యోదయం: 6.12
సూర్యాస్తమయం: 5.20
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు 

మేషం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. భూలాభాలు. ఒప్పందాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాలలో సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: సన్నిహితులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాభావం పెరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కర్కాటకం: వ్యయప్రయాసలు. బంధువర్గంతో వివాదాలు. శ్రమ పెరుగుతుంది. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

సింహం: కొత్త పరిచయాలు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

కన్య: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి వృద్ధి. మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సానుకూల పరిస్థితి.

తుల: కొన్ని పనులలో అవాంతరాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా సాగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

వృశ్చికం: ఆస్తి వివాదాలు ఇబ్బందికరంగా ఉండవచ్చు. ప్రయాణాలలో మార్పులు. అనుకున్న వ్యవహారాలలో వేగం తగ్గుతుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

ధనుస్సు: శుభకార్యాలకు హాజరవుతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

మకరం: వ్యవహారాలు ముందుకు సాగవు. నిర్ణయాలలో నిదానం అవసరం. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.

కుంభం: మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలు చక్కదిద్దుతారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మీనం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో మరింత పనిభారం.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా