ఈ రాశి వారికి వ్యాపారాలలో ఒడిదుడుకులు

24 Mar, 2021 06:23 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శు.ఏకాదశి తె.5.54 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి ద్వాదశి, నక్షత్రం పుష్యమి రా.7.29 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం లేదు,  దుర్ముహూర్తం ప.11.42 నుంచి 12.31 వరకు, అమృతఘడియలు.. ప.12.49 నుంచి 2.32 వరకు.

సూర్యోదయం :    6.05
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు:
మేషం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల సమయం.

మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. పదవీయోగం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.

తుల: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. చిత్రమైన సంఘటనలు.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి, విందువినోదాలు. కార్యజయం.

ధనుస్సు: రుణదాతల ఒత్తిడులు. అనుకున్న పనుల్లో జాప్యం. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మకరం: చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పోటీపరీక్షల్లో విజయం. భూ, వాహనయోగం. చర్చలు సఫలం. దైవదర్శనాలు. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.

మరిన్ని వార్తలు