గ్రహం అనుగ్రహం (27-12-2020)

27 Dec, 2020 06:24 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం తిథి శు.త్రయోదశి తె.5.41 వరకు (తెల్లవారితే సోమవారం),తదుపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక ప.1.30 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం సా.4.02 నుంచి 4.44 వరకు, అమృతఘడియలు... ఉ.10.48 నుంచి 12.33 వరకు.

సూర్యోదయం        :  6.32
సూర్యాస్తమయం    :  5.29
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

రాశిఫలాలు..
మేషం.. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేయాల్సివస్తుంది. నిర్ణయాలు మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం.. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.

మిథునం.. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కర్కాటకం.. సన్నిహితుల నుంచి ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అవరోధాలు తీరతాయి.

సింహం.. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో ముందడుగు. ఆకస్మిక ధనలబ్ధి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కన్య.. పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.

తుల.. పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం.. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యవహారాలలో విజయం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు.. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కార్యజయం. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

మకరం.. వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బంధువులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం.. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు.  అనారోగ్యం. ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం.. ముఖ్యమైన పనుల్లో విజయం. కోర్టు వివాదాల పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మరిన్ని వార్తలు