Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాలలో పురోగతి

18 May, 2022 06:05 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బ.తదియ రా.3.17 వరకు తదుపరి చవితి, నక్షత్రం జ్యేష్ఠ ఉ.11.10 వరకు, తదుపరి మూల వర్జ్యం సా.6.37 నుండి 8.06 వరకు దుర్ముహూర్తం ప.11.29 నుండి 12.20 వరకు అమృతఘడియలు... రా.3.32 నుండి 5.04 వరకు.

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం    :  6.21
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 


మేషం....పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. అనారోగ్య సూచనలు. బంధువుల తాకిడి పెరుగుతుంది.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనంగా ఉంటాయి.

వృషభం....మిత్రుల ప్రోద్బలంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు,ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం....పనులు చకచకా సాగుతాయి. ఆప్తులు దగ్గరవుతారు. దైవకార్యాలు చేపడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం....ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీ ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. ఆస్తులు విషయంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

సింహం...ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం దక్కదు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కన్య....సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజంలో గౌరవం. కీలక నిర్ణయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల....రుణబాధలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

వృశ్చికం....ఆర్థిక విషయాలలో పురోగతి. సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు..సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మకరం..పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు , ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం...కొత్త పరిచయాలు. సేవభావం పెరుగుతుంది. సన్నిహితులతో మనస్పర్థలు. ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మీనం....వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మరిన్ని వార్తలు