Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలు చేపడతారు

Published Mon, Nov 27 2023 5:18 AM

horoscope today 27 11 2023 rasiphalalu telugu  - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: పౌర్ణమి ప.2.10 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: కృత్తిక ప.1.48 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: తె.5.52 నుండి 7.29 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.10 నుండి 12.58 వరకు, తదుపరి ప.2.25 నుండి 3.13 వరకు, అమృతఘడియలు: ఉ.11.26 నుండి 1.01 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.15, సూర్యాస్తమయం: 5.20.

మేషం... కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

వృషభం... ఉద్యోగయోగం. పనులలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు కాస్త ఊరట. ప్రముఖులతో పరిచయాలు.

మిథునం..... వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ధనవ్యయం.

కర్కాటకం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం... శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక.

కన్య.... రుణఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. ప్రయాణాలు వాయిదా. ఆలయాలు సందర్శిస్తారు. మానసిక అశాంతి. 

తుల... పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. సోదరుల నుంచి కీలక సమాచారం. ఆహ్వానాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ధనుస్సు... పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం..... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన.

కుంభం.... శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. దైవదర్శనాలు. పనుల్లో జాప్యం. అనారోగ్యం.

మీనం... కుటుంబసౌఖ్యం. పనులు చకచకా సాగుతాయి.  విలువైన సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. వ్యాపారులకు అధిక లాభాలు.

Advertisement

What’s your opinion

Advertisement