ఈ రాశి వారికి వారం మధ్యలో అనుకోని లాభాలు

17 Dec, 2023 07:07 IST|Sakshi

మేషం: పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో ధననష్టం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. గోధుమ, ఆకుపచ్చరంగులు,  శివపంచాక్షరి పఠించండి.

వృషభం: కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలలో లక్ష్యాల మేరకు లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కవచ్చు.రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి

మిథునం: ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. అనుకోని ఖర్చులు రావచ్చు. ఎరుపు, చాక్లెట్‌రంగులు. శివాష్టకం పఠించండి

కర్కాటకం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. సోదరులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త  కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుఉతాయి. పారిశ్రామికవర్గాలకు ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వారం మధ్యలో ఆరోగ్యభంగం. సోదరులో వివాదాలు. పసుపు, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: కొత్త వ్యక్తులు పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగయత్నాలలో ముందడుగు వేస్తారు.  వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కన్య: కొన్ని వ్యవహారాలు కొంత నెమ్మదించినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు శుభవార్తలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో మనశ్శాంతి లోపిస్తుంది. ఆర్థిక హామీలు వద్దు. చాక్లెట్, ఆకుపచ్చరంగులు, కనకధారాస్తోత్రం పఠించండి.

తుల: పనులు విజయవంతంగా సాగుతాయి. సన్నిహితుల  నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. పట్టుదలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి.  కుటుంబసభ్యులు మీపట్ల మరింత విధేయత, అభిమానం చూపుతారు. వాహనాలు, భూములు కొంటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఇంటాబయటా సమస్యలు, దూరప్రయాణాలు. నలుపు, లేత నీలం రంగులు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు సైతం పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు సన్మానాలు.వారం  మధ్యలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. తెలుపు, లేత ఎరుపురంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

ధనుస్సు: ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బంధువులు, మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి.  ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలలో కొద్దిపాటి ఆటంకాలు. నిర్ణయాలలో తొందరపాటు తగదు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో  శుభవార్తలు, వాహనయోగం. చర్చలు సఫలం. నలుపు, చాక్లెట్‌ రంగులు, దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.

మకరం: ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి. వేడుకలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. కోర్టు వ్యవహారం ఒకటి సానుకూలమవుతుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యతిరేక పరిస్థితుల  అనుకూలంగా మార్చుకుంటారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుఉతాయి విద్యార్థుల యత్నాలు మరింత అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అత్యంత ఆప్తులతో మాటపట్టింపులు. ఎరుపు, నేరేడురంగులు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి

కుంభం: ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత బయటపడతారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. చాక్లెట్, ఆకుపచ్చరంగులు,  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం: శ్రమకు ఫలితం దక్కుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి ఉంటుంది. సోదరులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఉద్యోగాలలో అనుకూలస్థితి. రాజకీయవర్గాలకు ఊహించని విధంగా పదవులు లభిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. సోదరులతో మాటపట్టింపులు. నీలం, నేరేడు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. 

>
మరిన్ని వార్తలు