2024లో హైదరాబాద్‌లో రాబోయే ఇళ్లు ఎన్నంటే..

19 Feb, 2024 17:14 IST|Sakshi

రియల్‌ఎస్టేట్‌ రంగం రోజురోజుకు ఎంతలా వృద్ధి చెందుతోందో తెలియనిది కాదు. దానికితోడు మారుతున్న జీవనప్రమాణాలకు అనుగుణంగా సొంతంగా ఇళ్లు కట్టుకోవాలనుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏటా ఇళ్ల నిర్మాణం అధికమవుతోంది. 2023లో ఏమేరకు ఇంటి నిర్మాణాలు పూర్తి చేశారో.. 2024లో ఈ ట్రెండ్‌ ఎలా ఉండబోతుందో అనరాక్‌ రిసెర్చ్‌ బృందంం నివేదిక విడుదల చేసింది. 

దేశంలో కిందటేడాది ప్రముఖ ఏడు నగరాల్లో 4.35 లక్షల ఇళ్లను అభివృద్ధి చేసినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్ నివేదికలో పేర్కొంది. పూర్తయిన ఇళ్లలో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. 2022లో  4.02 లక్షల యూనిట్లు పూర్తయ్యాయి. ఫస్ట్ సేల్ ట్రాన్సాక్షన్ల డేటా ఆధారంగా ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను అనరాక్ తయారు చేసినట్లు తెలిసింది.

ఈ నివేదిక ప్రకారం.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో కిందటేడాది 1,43,500 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అంతకుముందు ఏడాదిలో పూర్తయిన 1,26,720 ఇళ్లతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. దిల్లీ-ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూర్తయిన ఇళ్లు 86,300 యూనిట్ల నుంచి 32 శాతం పెరిగి 1,14,280 యూనిట్లకు చేరింది.

బెంగళూరు, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, చెన్నై మూడు సిటీల్లో కలిపి కిందటేడాది 87,190 ఇళ్లు పూర్తయ్యాయి. 2022లో ఈ సంఖ్య 81,580గా నమోదైంది. పుణెలో   కిందటేడాది పూర్తయిన ఇళ్లు 84,200 యూనిట్లకు పెరిగింది. ఏడాది ప్రాతిపదికన 23 శాతం వృద్ధి నమోదు చేసింది. కోల్‌‌‌‌‌‌‌‌కతాలో 25,075 ఇళ్లు కిందటేడాది పూర్తయ్యాయి.

ఇదీ చదవండి: కదిలే ఇళ్లు.. సకల సౌకర్యాలు!

టాప్ ఏడు నగరాల్లో 2024లో పూర్తి చేయడానికి సుమారు 5.31 లక్షల యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని నివేదికలో తేలింది. ఈఏడాది ఎంఎంఆర్‌లో 1.61లక్షల యూనిట్లు పూర్తి కావాల్సి ఉండగా దిల్లీ-ఎన్‌సీఆర్‌లో 1.44లక్షల యూనిట్లు, పుణెలో 97,000 యూనిట్లు, హైదరాబాద్‌లో దాదాపు 34,770 యూనిట్లు, కోల్‌కతాలో 25,220 యూనిట్లు, చెన్నైలో 17,580 యూనిట్లు పూర్తవుతాయని నివేదిక పేర్కొంది.

whatsapp channel

మరిన్ని వార్తలు