ఇదేం ఆఫర్‌ సామీ! ఇల్లు కొంటే భార్య ఉచితమా?

24 Jan, 2024 16:16 IST|Sakshi

చైనాలో రియల్‌ ఎస్టేట్‌ దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే.. దీంతో అక్కడ ఆస్తుల విలువల ఆర్థిక వ్యవస్థపై ఘోరంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే రియల్‌ ఎస్టేట్‌ సంకోభం చైనా ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుదేలుచేసింది. చాలా తిరోగమనంలో సాగుతోంది. దీంతో కొందరూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులురకరకాల మార్కెట్‌ వ్యూహాలతో ఇళ్లను అమ్మే పనిలో పడ్డారు. ఈ ప్రకటనల విషయంలో వారిలోంచి ఎంతలా క్రియేటివిటీ బయటకొస్తుందంటే..నిర్ఘాంతపోయేంత విచిత్రమైన స్థితిలో ఉన్నాయా ప్రకటనలు. వింటే మాత్రం..వామ్మే ఇదేం ఆఫర్‌ అని నోరెళ్లబెట్టడం మాత్రం ఖాయం!

తాజగా టియాంజన్‌లోని ఓ కంపెనీ ఎంత విచిత్రమైన రీతీలో అడ్వర్టైస్‌మెంట్‌ చేసిందంటే..ఛీ అని కచ్చితంగా అంటారు. మరి ఇంత ఘోరమా! అని అనుకుండా ఉండలేరు. ఇళ్లు అమ్ముడుపోవాలని ఏకంగా 'ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి' అని అడ్వర్టైస్‌మెంట్‌ ఇచ్చింది. చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లోని మరో కంపెనీ ఏకంగా బంగారు కడ్డీలను ఇస్తామని ప్రకటించిందట. ఇల్లు కొనడానికి ఏదైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు గానీ మరీ ఇలా భార్యలేంటి అని అందరూ సీరియస్‌ అయ్యారు. పైగా ఇది చైనీస్‌ రెగ్యులేటర్‌లకు కూడా నచ్చలేదట. ఇలా ప్రకటన ఇచ్చినందుకగానూ సదరు కంపెనీకి రూ. 3 లక్షల దాక జరిమాన విధించింది. 

గత రెండేళ్ల నుంచి రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడం ప్రారంభించింది. ఆ తర్వాత నెమ్మదిగా నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. దీంతో అనేక మల్టీ బిలయన్‌ డాలర్ల కంపెనీ కుప్పకూలాయి. దీని ప్రభావంతో చైనాలో నాలుగు సంపన్న నగరాల్లో గృహాల ధరలు దారుణంగా పడిపోయాయి. అలాగే కొత్త ఇళ్లు విక్రయాలు కూడా తగ్గిపోయాయి. అంతేగాదు ఈ రియల్‌ ఎస్టేట్‌ తిరోగమనం మరో రెండేళ్ల పాటు కొనసాగుతుందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ మాజీ హెడ్ షెంగ్ సాంగ్‌చెంగ్ అంచనా వేశారు. పైగా దశాబ్దం క్రితం రెండంకెల వృద్ధిని సాధించిన చైనా ఆర్థిక వ్యవస్థ నాలుగో త్రైమాసికంలో కేవలం 5.2% వృద్ధితో ఆర్థికవేత్తల అంచనాలను సైతం అందుకోలేకపోయింది. 

(చదవండి: మొక్కల ఊసులు రికార్డయ్యాయి ఇలా!)

whatsapp channel

మరిన్ని వార్తలు