అదానీ రెన్యూవబుల్‌ ఎనర్జీ విస్తరణ

4 Oct, 2022 06:25 IST|Sakshi

కొత్తగా 3 అనుబంధ సంస్థల ఏర్పాటు

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం అదానీ గ్రీన్‌ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన విభాగంలో కార్యకలాపాలు మరింత విస్తరించింది. తాజాగా పూర్తి అనుబంధ సంస్థ అదానీ రెన్యూవబుల్‌ ఎనర్జీ హోల్డింగ్‌ ఫోర్‌ లిమిటెడ్‌ ద్వారా మూడు అనుబంధ సంస్థల ఏర్పాటుకు తెరతీసింది. పునరుత్పాదక ఇంధన బిజినెస్‌ కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.

అదానీ రెన్యూవబుల్‌ ఎనర్జీ హోల్డింగ్‌కు ఇవి అనుబంధ సంస్థలుగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. వీటి ద్వారా ప్రధానంగా పవన విద్యుత్, సౌర విద్యుత్‌సహా వివిధ పునరుత్పాదక ఇంధన మార్గాల ద్వారా విద్యుత్‌ ప్రసారం, అభివృద్ధి, పంపిణీ, విక్రయం తదితరాలను చేపట్టనున్నట్లు వివరించింది.  

ఈ వార్తల నేపథ్యంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం పతనమై రూ. 2,088 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు