అదానీకి ఊరట:వేల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ జంప్‌, ఎందుకు?

1 Mar, 2023 13:40 IST|Sakshi

సాక్షి,ముంబై: షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో విలవిల్లాడుతున్న అదానీ గ్రూపునకు భారీ ఊరట లభించింది.  బుధవారం నాటి మార్కెట్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా ఎగిసాయి. దీంతో  అదానీ గ్రూప్ ఎం-క్యాప్  ఏకంగా రూ. 39 వేల కోట్లు  మేర పెరిగింది. అదానీ గ్రూప్ షేర్లు పెరగడం ఇది రెండో రోజు. 

అదానీకి చెందిన రెండో  విలువైన  స్టాక్ అదానీ పోర్ట్స్ & సెజ్, ఇప్పటివరకు మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ.4,277 కోట్లు జోడించింది.  అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 10 శాతం జంప్ చేసి రూ.1,500 స్థాయికి చేరుకున్నాయి. వీటితోపాటు అదానీ గ్రీన్ ఎనర్జీ  jpce గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను రూ. 39,000 కోట్ల నుంచి రూ. 7.50 లక్షల కోట్ల మార్కుకు పెంచిన స్టాక్‌లలో ఉన్నాయి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ 
బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సమయానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 10 శాతం ఎగసింది. గత రెండు రోజుల్లో ఈ షేరు 29 శాతం లాభపడింది.  అదానీ పోర్ట్స్  రూ.4,277 కోట్లు ,అదానీ గ్రీన్ ఎనర్జీ  రూ.3,841 కోట్లు , అదానీ పవర్, అదానీ విల్మార్ , అంబుజా సిమెంట్స్   రూ. 2-3వేల కోట్లను గ్రూప్ ఎం-క్యాప్‌కు జోడించడ విశేషం. 

ముంద్రా అల్యూమినియం
కాగా కంపెనీ అనుబంధ సంస్థ ముంద్రా అల్యూమినియం, ఒడిశాలోని కుట్రుమాలి బాక్సైట్ బ్లాక్  తవ్వకాలకు ప్రాధాన్య బిడ్డర్‌గా  నిలిచింది. ఒడిషాలోని కలహండి ,రాయగడ జిల్లాల్లో ఉన్న ఈ బ్లాక్‌లో మొత్తం 128 మిలియన్ టన్నుల భౌగోళిక వనరులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒడిశా ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) పొందింది. మరోవైపు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు అదానీ గ్రూప్ సింగపూర్, హాంకాంగ్‌లలో ఫిక్ట్స్‌డ్‌ ఇన్‌కం రోడ్‌షోను నిర్వహిస్తోంది. దీనికి తోడు అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 800 మిలియన్ల డాలర్లు రుణ సదుపాయాన్ని పొంద నుందన్న నివేదికలు  పాజిటివ్‌గా మారాయి. 

మరిన్ని వార్తలు