బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్ట్లీ

6 Feb, 2021 15:35 IST|Sakshi

హైదరాబాద్‌లో గృహాలు ఖరీదు

నగరంలో అఫర్డబులిటీ ఇండెక్స్‌ నిష్పత్తి 31 శాతం 

అదే బెంగళూరులో 28 శాతమే 

నైట్‌ఫ్రాంక్‌ ఇండియా అఫర్డబులిటీ ఇండెక్స్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: గృహాల ధరల్లో బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్లీ. పదేళ్లలో రెండు నగరాల మధ్య నివాస ధరల్లో తేడాలొచ్చేశాయి. 2010లో బెంగళూరులో 48 శాతంగా ఉన్న అఫర్డబులిటీ హౌసింగ్‌ ఇండెక్స్‌.. 2020 నాటికి 28 శాతానికి తగ్గింది. అదే హైదరాబాద్‌లో దశాబ్ద క్రితం 47 శాతంగా ఉండగా.. ఇప్పుడది 31 శాతానికి తగ్గింది. ఇక దేశంలోనే అత్యంత సరసమైన గృహా నిర్మాణ మార్కెట్‌గా అహ్మదాబాద్‌ నిలిచింది. ఇక్కడ అఫర్డబులిటీ ఇండెక్స్‌ 46 శాతం నుంచి 24 శాతానికి పడిపోయిందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. 

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని అఫర్డబులిటీ హౌసింగ్‌ ఇండెక్స్‌–2020ని విడుదల చేసింది. అఫర్డబులిటీ ఇండెక్స్‌ అనేది సగటు గృహానికి సమానమైన నెలవారీ వాయిదాలు (ఈఎంఐ), ఆదాయ నిష్పత్తిని సూచిస్తుంది. దీన్ని నగరాల్లోని గృహాల ధరలు, వడ్డీ రేట్లు, ఆదాయంలో వృద్ధి, కొనుగోలుదారుని సామర్థ్యం వంటి విభాగాల్లో కదలికలను బట్టి అంచనా వేశారు. గృహాల ధరలలో క్షీణత, తక్కువ వడ్డీ రేట్ల కారణంగా హౌసింగ్‌ అఫర్డబులిటీ మెరుగవ్వటానికి ప్రధాన కారణాలని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు. అఫర్డబులిటీ నిష్పత్తి 50 శాతానికి మించితే.. బ్యాంక్‌లు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నుంచి గృహ రుణాలు పొందటం కష్టమవుతుందని పేర్కొన్నారు. 

ఇతర నగరాల్లో.. 
ముంబై అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. ఇక్కడ అఫర్డబులిటీ ఇండెక్స్‌ 61 శాతంగా ఉంది. పదేళ్ల క్రితం ఇక్కడ రేషియో 93 శాతంగా ఉంది. ఎన్‌సీఆర్‌లో 53 శాతం నుంచి 38 శాతానికి, పుణేలో 39 శాతం నుంచి 26 శాతానికి, చెన్నైలో 51 శాతం నుంచి 39 శాతానికి, కోల్‌కతాలో 45 శాతం నుంచి 30 శాతానికి అఫర్డబులిటీ హౌసింగ్‌ రేషియో తగ్గాయి.

చదవండి:
బంగారం కొనే వారికి గుడ్‏న్యూస్

ఎస్‌బీఐ వినియోగదారులకు శుభవార్త!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు