Heritage Foods Shares Fall: స్కామ్‌స్టర్‌ ‘బాబు’ సెగ,హెరిటేజ్‌ షేర్లు ఢమాల్‌

12 Sep, 2023 17:48 IST|Sakshi

రూ. 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్మాం కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌తో హెరిటేజ్ స్టాక్ ఢమాల్‌ అంది. వరుసగా మూడు రోజుల పాటు ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఈ షేరు పాతాళానికి పడియింది. ముఖ్యంగా చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో పెట్టుబడిదారులు కంపెనీ భవిష్యత్తుపై ఆశలో కోల్పోయి, షేర్ల అమ్మకానికి ఎక్కువశాతం మొగ్గు చూపిస్తుండటం గమనార్హం.

సోమవారం బీఎస్‌ఈ హెరిటేజ్ ఫుడ్స్ స్క్రిప్ 7 శాతం నష్టంతో రూ.253 వద్ద ముగిసింది. మంగళవారం కూడా ఈ నష్టాలు కొనసాగాయి. ఏకంగా 13 శాతం కుప్పకూలి 221.45 వద్ద ముగిసింది.  ఈ షేరు  52 వారాల గరిష్టం రూ. 287.35 , 52 వారాల కనిష్ట ధర రూ.135.15.  కాగా చంద్రబాబు భార్య భువనేశ్వరి డెయిరీ సంస్థ వైస్-ఛైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గాను, కుమారుడు లోకేశ్‌ భార్య బ్రాహ్మణి నారా హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు