ఎయిర్‌టెల్‌కు సుప్రీంకోర్టులో ఊరట!

24 Aug, 2021 20:14 IST|Sakshi

ప్రముఖ టెలికామ్ దిగ్గజం భార‌తీ ఎయిర్‌టెల్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మూడు వారాల వరకు వీడియోకాన్ టెలీ క‌మ్యూనికేష‌న్స్(వీటీఎల్‌) స‌ర్దుబాటు స్థూల ఆదాయం(ఏజీఆర్‌) బ‌కాయిలకు సంబధించిన రూ.1,300 కోట్ల చెల్లింపుకోసం భారతి ఎయిర్‌టెల్‌ అందించిన బ్యాంక్ గ్యారంటీల‌ను వాడుకోవద్దు అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. మధ్యంతర ఉపశమనం కోసం ఈలోగా టెలికామ్ వివాదాల సెటిల్ మెంట్ అండ్ అప్పిలేట్ ట్రిబ్యునల్(టీడీఎస్ఎటి)కు వెళ్లేందుకు ఎయిర్‌టెల్‌కు అనుమతి ఇచ్చింది. ఏజీఆర్ తీర్పును కోర్టు సమీక్షించదని ఈ సందర్భంగా మరోసారి సుప్రీంకోర్టు తెలిపింది. 

2016లో ఎయిర్‌టెల్‌ వీడియోకాన్ స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసింది. అయితే, ఈ కొనుగోలు సందర్భంగా వీడియోకాన్ ఏజీఆర్‌ బకాయిలను కేంద్రం డిమాండ్ చేయకుండా భారతి ఎయిర్‌టెల్‌ టెలికమ్యూనికేషన్స్ శాఖ దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఎస్ అబ్దుల్ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన బెంచ్ నేడు(ఆగస్టు 24) విచారించింది. ఎయిర్‌టెల్‌ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ మాట్లాడుతూ.. "వీడియోకాన్ ఏజీఆర్‌ బకాయిలను వారంలోగా రూ.1,500 కోట్లకు చెల్లించాలని కోరుతూ ఎయిర్‌టెల్‌కు డీఓటి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ చెల్లించడంలో విఫలమైతే అప్పుడు హామీ ఇచ్చిన ఎయిర్‌టెల్‌ బ్యాంకు నుంచి రికవరీ చేస్తామని డీఓటి తెలిపింది. ఒక టెలికామ్ కంపెనీ స్పెక్ట్రమ్ ఏజీఆర్‌ బకాయిలను ఆ కంపెనీ మాత్రమే భరించాలని కొనుగోలుదారుడు కాదు అని" అన్నారు. అందుకే వీడియోకాన్ ఏజీఆర్‌ బకాయిలను ఎయిర్‌టెల్‌ నుంచి తిరిగి పొందలేరని పేర్కొన్నారు.(చదవండి: జోకర్‌ రీఎంట్రీ... జర జాగ్రత్త! క్షణాల్లో మీ ఖాతా ఖాళీ)

మరిన్ని వార్తలు