Amazon Layoffs: అమెజాన్‌ మళ్లీ షాక్‌ ఇచ్చింది: ఈసారి ఎవరంటే..!

9 Oct, 2023 15:08 IST|Sakshi

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్(Amazon) లో మరోసారి ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది.గ్లోబల్ కమ్యూనికేషన్స్‌ కీలకమైన విభాగాల్లో ఈ లేఆఫ్‌లను  ప్రకటించింది. డెడ్‌లైన్ నివేదిక ప్రకారం దేశీయ, అంతర్జాతీయంగా  కమ్యూనికేషన్ విభాగాలలో   దాదాపు  5 శాతం ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుంది.

ప్రైమ్ వీడియో, మ్యూజిక్‌ సహా కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగాలను ఇది ప్రభావితం చేయనుందని డెడ్‌లైన్‌ రిపోర్ట్‌ చేసింది. ప్రభావిత ఉద్యోగులకు 60 రోజుల వ్యవధిలో వారి రెగ్యులర్ జీతం, ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అలాగే తొలగించిన ఉద్యోగులు విభజన ప్యాకేజీలు, పరివర్తన ప్రయోజనాలు, ఉద్యోగ నియామకంలో సహాయం కోసం అర్హులు. Amazon Studios, Amazon Prime వీడియో, Amazon Music వర్టికల్స్‌కి సంబంధించిన కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌లో అమెజాన్ ఇటీవల ఉద్యోగాల కోతలను ప్రకటించింది. 

కాగా టెక్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం కారణంగా వేలాదిమందిని  ఉద్యోగులనుంచి తొలగించాయి. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అమెజాన్‌ 2022 నవంబర్- జనవరి 2023 మధ్యకాలంలో 18వేలమందిని తొలగించింది. క్లౌడ్ కంప్యూటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, అడ్వర్టైజింగ్ చ ట్విచ్ లైవ్ స్ట్రీమింగ్ సర్వీసెస్వంటి రంగాలపై దృష్టి సారించి, అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ వీడియో, గ్రాసరీ విభాగాల్లో మరికొంతమందిని తీసివేసింది. 2023 మార్చిలో 9వేల మందిని తొలగించింది. దాదాపు 27 వేల మందిని తొలగించడం కష్టమైనదే అయినప్పటికీ కంపెనీ మంచి ఫలితాన్నిస్తుందని అమెజాన్ సీఈవోఆండీ జాస్సీ కంపెనీ వార్షిక సర్యసభ్య సమావేశంలోప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు