దిగ్గజ కంపెనీ కఠిన నిర్ణయం.. 600 మంది ఉద్యోగుల తొలగింపు?

7 Nov, 2023 17:26 IST|Sakshi

ప్రముఖ అడిటింగ్ సంస్థ ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) కష్టాల్లో చిక్కుకుంది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్‌ మొత్తం ఉద్యోగుల్లో  సుమారు 600 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) ఆప్షన్ ఇచ్చాం.. అందుకు అనుగుణంగా సిబ్బంది వీఆర్ఎస్‌ ఆప్షన్ ఎంచుకోకుంటే వారి తొలగింపు తప్పదని పీడబ్ల్యూసీ ప్రతినిధులు చెబుతున్నారు. పీడబ్ల్యూసీలో 25 వేల మంది పని చేస్తుండగా..అడ్వైజరీ బిజినెస్‌, ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొంది.  

‘బిగ్ ఫోర్’లో లేఆఫ్స్‌ అలజడి
ప్రపంచ వ్యాప్తంగా అకౌంటింగ్‌, ప్రొఫెషనల్‌ సర్వీసులు అందించే అతిపెద్ద ‘బిగ్ ఫోర్’ సంస్థలుగా డెలాయిట్‌ ఎలోయిట్, ఎర్నెస్ట్ అండ్‌ యంగ్ (ey), ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PwC), క్లిన్‌వెల్డ్ పీట్ మార్విక్ గోర్డెలర్ (KPMG)లు ప్రసిద్ధి చెందాయి. ఆ నాలుగు సంస్థల్లో ఒకటైన పీడబ్ల్యూసీ 600 మంది వర్క్‌ ఫోర్స్‌ను తగ్గించే పనిలో ఉండగా..

గత నెలలో మరో సంస్థ కేపీఎంజీ యూకే విభాగంలోని డీల్ అడ్వైజరీ విభాగంలో పనిచేస్తున్న 100 మందిని ఇంటికి సాగనంపాలని భావిస్తుండగా.. యూకే 800 కంటే ఎక్కువ మందిని  తగ్గించాలని డెలాయిట్ యోచిస్తున్నట్లు పలు నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు