అమూల్ పాల ధర పెంపు: ఏకంగా లీటరుకు 3 రూపాయలు బాదుడు

3 Feb, 2023 11:24 IST|Sakshi

న్యూఢిల్లీ: అమూల్ కంపెనీ  తన వినియోగదారులకు మరోసారి షాకిచ్చింది.  ఫిబ్రవరి 3 నుండి అమూల్ పాల ధరలు లీటరుకు రూ. 3 పెంచేసింది. పెరిగిన ధరలు అన్ని వేరియంట్లపై వర్తిస్తాయని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ  తాజా ప్రకటన ప్రకారం, లీటరు అముల్ తాజా  పాలు లీటరు ధర రూ. 54 గాను,  అమూల్ ఆవు పాలు లీటరు ధర రూ.56గా  ఉంది. 

గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 2022లో దీపావళికి ముందు  ఫుల్ క్రీమ్ మిల్క్, తాజా, గోల్డ్‌,  గేదె పాల ధరలను లీటరుకు 2 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే.గత 10 నెలల్లో పాల ధరలు  రూ.12 పెరిగాయి. అంతకు ముందు ఏడేళ్ల పాటు పాల ధర పెరగలేదు. ఏప్రిల్ 2013 , మే 2014 మధ్య పాల ధరలు లీటరుకు రూ.8 చొప్పున పెరిగాయి. వేసవిలో పాల ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి. దీనివల్ల పాల కంపెనీలు పశువుల కాపరులకు అధిక రేట్లు చెల్లించాల్సి వస్తోంది. అందుకే రానున్న రోజుల్లో పాల ధరలు  మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు