-

కొత్త ఏడాదిలో ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 

1 Dec, 2020 13:32 IST|Sakshi

రానున్న వారాల్లో ఉత్పత్తి ప్రారంభం

2021 మొదట్లో వాహనాల విడుదల

రెండు ప్రత్యేక కలర్స్‌లో తయారీ

సుజుకీ తయారీ బర్గ్‌మ్యాన్‌ స్ట్రీట్‌ 125కు పోటీ  

ముంబై, సాక్షి: మ్యాక్సి స్కూటర్‌.. ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160ను వచ్చే ఏడాది(2021) తొలినాళ్లలో విడుదల చేసేందుకు పియాజియో ఇండియా ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. ఇటాలియన్‌ కంపెనీ దేశీయంగా విడుదల చేయనున్న ఈ ప్రధాన వాహనాన్ని రెండు ప్రత్యేక కలర్స్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. కంపెనీ బారామతిలో్ ఏర్పాటు చేసిన ప్లాంటులో మ్యాక్సి స్కూటర్‌ తయారీకి సన్నాహాలు చేసినట్లు పియాజియో ఇటీవల తెలియజేసింది. ఈ ఏడాది(2020) ఫిబ్రవరిలో గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి క్యాండీ రెడ్‌ కలర్‌లో మ్యాక్సి స్కూటర్‌ను పియాజియో ప్రదర్శించింది. తాజాగా బ్లూకలర్‌పైనా కంపెనీ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. దేశీయంగా జపనీస్‌ దిగ్గజం సుజుకీ తయారీ బర్గ్‌మ్యాన్‌ స్ట్రీట్‌ 125 వాహనానికి ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ ప్రత్యక్ష 160 పోటీనివ్వగలదని ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: (కార్లయిల్‌ చేతికి గ్రాన్సూల్స్‌ ఇండియా!)

ఎల్‌సీడీ క్లస్టర్
దేశీ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160ను పియాజియో ఇటలీలో రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. తద్వారా ఈ విభాగంలో విలువైన బ్రాండ్లకు డిమాండ్‌ ఉన్నట్లు చెబుతున్నాయి. మూడు వాల్వ్‌ల ఫ్యూయల్‌ ఇంజక్ట్‌డ్‌ మోటార్‌తో కూడిన 160 సీసీ ఇంజిన్‌ను ఆధునీకరించి మ్యాక్సీ స్కూటర్‌లో వినియోగించినట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, యూఎస్‌బీ చార్జింగ్‌ పోర్ట్‌, డిస్క్‌ బ్రేకులు తదితర ఫీచర్స్‌తో స్కూటర్‌ వెలువడనున్నట్లు చెబుతున్నారు. ట్విన్‌ క్రిస్టల్‌ హెడ్‌లైట్స్‌, 3 కోట్‌ హెచ్‌డీ బాడీ పెయింట్‌ ఫినిష్‌తో రూపొందుతున్నట్లు వివరించారు. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా రూపొందిన ఎప్రిలియా స్కూటర్‌ ఖరీదు రూ. 1.1-1.2 లక్షల స్థాయిలో ఉండొచ్చని ఆటో వర్గాల అంచనా.

మరిన్ని వార్తలు