-

ఎంత చెబుతున్నా వినరు.. ఆసక్తికర గణాంకాలు!

26 Nov, 2023 18:33 IST|Sakshi

పిల్లలకు చిరుతిండ్లు, జంక్‌ఫుడ్‌ రుచించినంతగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు రుచించవు. అందుకే అసలు ఆహారాన్ని పక్కన పెట్టి అనవసరమైన పదార్థాలతోనే కడుపు నింపుకొంటారు. పిల్లలే కాదు పెద్దల్లోనూ ఆ అలవాటు ఎక్కువగా ఉంది. ఆరోగ్యకరమైన జీవన విధానాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా జంక్ ఫుడ్ సేల్స్ మాత్రం భారీగా పెరుగుతున్నాయి. 

తాజాగా యాక్సెస్‌‌‌‌‌‌‌‌ టు న్యూట్రిషన్‌‌‌‌‌‌‌‌ ఇనీషియేటివ్‌‌‌‌‌‌‌‌ (ఏటీఎన్‌‌‌‌‌‌‌‌ఐ) రిపోర్ట్ ప్రకారం జంక్‌ఫుడ్‌ సేల్స్‌ పెరుగుతున్నాయని తెలుస్తోంది. నివేదికలోని వివరాల ప్రకారం.. టాప్ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ కంపెనీల సేల్స్‌‌‌‌‌‌‌‌లో ప్యాకేజ్డ్ ఫుడ్స్‌‌‌‌‌‌‌‌ వాటా పెరుగుతోంది.  దేశంలో ప్రముఖ 20 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ కంపెనీలు తయారుచేస్తున్న 1,901 ప్రొడక్టుల్లో కేవలం 24 శాతం మాత్రమే ఆరోగ్యకరమైనవి. ప్యాకేజ్డ్‌‌‌‌‌‌‌‌ ఫుడ్ అమ్మకాల్లో ఈ కంపెనీల వాటా 36 శాతంగా ఉంది.  మొత్తం ఏడు కేటగిరీల్లో 58 ఇండికేటర్లను వాడి కంపెనీలను విశ్లేషించామని ఏటీఎన్‌‌‌‌‌‌‌‌ఐ వెల్లడించింది.  

ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ వివరాలు, గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌, లేబులింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఏటీఎన్‌‌‌‌‌‌‌‌ఐ కంపెనీలకు  హెల్తీనెస్‌‌‌‌‌‌‌‌ రేటింగ్‌ ఇచ్చింది. ఇందులో  ఐటీసీ టాప్‌‌‌‌‌‌‌‌లో ఉందని పేర్కొంది. తర్వాత స్థానాల్లో హిందుస్థాన్ యునిలీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నెస్లే ఇండియా, పెప్సికో ఇండియా, కోకకోలా ఇండియా ఉన్నాయి. 5 స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటింగ్‌‌‌‌‌‌‌‌లో 3.5 కంటే ఎక్కువ స్టార్స్‌‌‌‌‌‌‌‌ పొందిన ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను హెల్తీ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లుగా ఏటీఎన్‌‌‌‌‌‌‌‌ఐ వర్గీకరించింది. ఇందులో పండ్లు, కూరగాయలు, ఫైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కంట్రోలింగ్ స్థాయిలో  సాచ్యురేటెడ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాట్‌‌‌‌‌‌‌‌, షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. 

ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! 
 
ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో చాలా వాటికి చెందిన ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ల రేటింగ్‌‌‌‌‌‌‌‌ 3.5 కంటే తక్కువ ఉందని ఏటీఎన్‌‌‌‌‌‌‌‌ఏ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. టాప్‌‌‌‌‌‌‌‌ 20 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ కంపెనీల ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ల యావరేజ్‌‌‌‌‌‌‌‌ రేటింగ్ 1.9 ఉందని తెలిపింది. సగానికి పైగా (55.6 శాతం) కంపెనీల ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ల రేటింగ్‌‌‌‌‌‌‌‌  ఐదుకు 1.5గా ఉందని, కేవలం 12 శాతం  ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు చిన్న పిల్లలు తినేందుకు అర్హత పొందాయని వెల్లడించింది. ఫుడ్ అండ్ బెవరేజ్‌‌‌‌‌‌‌‌  ఇండస్ట్రీలో అనేక మార్పులు వస్తున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రెగ్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ గారెట్‌‌‌‌‌‌‌‌ అన్నారు. డైట్‌‌‌‌‌‌‌‌, న్యూట్రిషన్‌‌‌‌‌‌‌‌, హెల్త్‌‌‌‌‌‌‌‌ వంటి అంశాలపై కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయని చెప్పారు.

ఇదీ చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్యగమనిక!

ప్యాకేజ్డ్ ఫుడ్స్‌‌‌‌‌‌‌‌లో  ఉప్పు, షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌‌‌‌‌‌‌‌ వాటాను  హిందుస్తాన్ యూనిలీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐటీసీ, పెప్సికో వంటి కంపెనీలు వేగంగా తగ్గిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలతో తయారైన ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను  హిందుస్తాన్‌‌‌‌‌‌‌‌ యునిలీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐటీసీలు తయారుచేస్తున్నాయి. కానీ అందులోనూ చాలా సమస్యలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. హెల్తీ ఫుడ్‌‌‌‌‌‌‌‌ అంటే ఏంటో తెలియజేయడానికి ప్రామాణిక నిర్వచనం ఏమీ లేదని గుర్తు చేసింది. కంపెనీలు ఇష్టం వచ్చినట్లు ‘హెల్తీఫుడ్‌’ పేరుతో ఉత్పత్తులు తయారుచేస్తున్నాయని తెలిపింది. కానీ అవి అంతర్జాతీయ ప్రయాణాలకు తగినట్లు గుర్తింపు పొందడం లేదని చెప్పింది.

మరిన్ని వార్తలు