-

కొత్త పెట్టుబడులకు కాటమరాన్.. ఏ రంగాల్లో అంటే..

26 Nov, 2023 18:08 IST|Sakshi

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 'నారాయణ మూర్తి' (Narayana Murthy)కి చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ 'కాటమరన్‌' (Catamaran) పెట్టుబడులను మరిన్ని రంగాలకు పెంచడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

డిజిటల్ యాక్సిలరేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్స్‌పో (DATE) సందర్భంగా కాటమరాన్ చైర్మన్ అండ్ ఎండీ 'రంగనాథ్' మాట్లాడుతూ.. 2022తో పోలిస్తే భారతదేశంలోని స్టార్టప్‌ల వాల్యుయేషన్ అంచనాలు తగ్గాయని, మంచి ఆలోచనలు రానున్న రోజుల్లో పెట్టుబడులను ఆకట్టుకుంటాయని వెల్లడించారు.

ఇదీ చదవండి: నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న అందగత్తె.. కానీ ఈమె..

భారతదేశం ఇప్పటికే అనేక రంగాలను ఆకరిస్తోందని, తద్వారా పెట్టుబడులు పెరుగుతున్నాయని రంగనాథ్ తెలిపారు. డీప్ టెక్, ఆటోమొబైల్స్‌లో ఎగుమతి, భాగాలను తయారు చేయగల కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా వ్యాఖ్యానించారు. ఇప్పటికే సంస్థ స్పేస్‌ ఎక్స్‌, డీప్‌ టెక్‌ ఎనర్జీ, లాగ్‌ 8, బీ2బీ ఈ-కామర్స్‌ సంస్థ ఉడాన్‌, ఎడ్యుటెక్‌ ఉడేమీ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు