‘నా సత్తా ఏంటో అప్పుడు చూపిస్తా’

3 May, 2022 16:55 IST|Sakshi

అవమానకర రీతిలో భారత్‌పే నుంచి బయటకు పంపబడ్డ ఆశ్నీర్‌ గ్రోవర్‌ తన సత్తా ఏంటో చూపిస్తానంటూ సవాల్‌ విసిరారు. చండీగడ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గ్రోవర్‌.. త్వరలోనే తన సొంత డబ్బులతో ఓ స్టార్టప్‌ పెడతానని, ఏ ఇన్వెస్టరు దగ్గర నుంచి నిధులు సమీకరించకుండానే ఆ స్టార్టప్‌ను లాభాల్లోకి తెచ్చి చూపెడతానంటూ ప్రకటించారు.

యూనికార్న్‌ హోదా పొందిన స్టార్టప్‌లలో ఒకటైన భారత్‌పే శాత్వత్‌తో కలిసి ఆశ్నీర్‌గ్రోవర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడంతో క్రమంగా యూనికార్న్‌గా ఎదిగింది. అయితే కంపెనీ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై కో ఫౌండర్‌ అశ్నీర్‌ గ్రోవర్‌, అతని భార్య మాధురి జైన్‌లను భారత్‌ పే నుంచి బయటకు సాగనంపారు.

గడిచిన ఆరు నెలలుగా భారత్‌పే విషయంలో ఇటు అశ్నీర్‌ గ్రోవర్‌, అటు బోర​​​​​‍్డు మెంబర్లతో నిత్యం మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇన్వెస్టర్లుగా స్టార్లప్‌లోకి ప్రవేశించిన వారు చివరకు తననే బయటకు పంపారంటూ అనేక సందర్భాల్లో అశ్నీర్‌ వెల్లడించారు. ఈ క్రమంలో అసలు ఇన్వెస్టర్లు లేకుండా పూర్తగా సొంత సొమ్ముతో స్టార్టప్‌ ప్రారంభించి సక్సెస్‌ బాట పట్టిస్తానంటూ శపథం చేశారు. 
 

చదవండి: ఏం చిల్లరగాళ్లు ఉన్నర్రా మీరు ! బాధ్యత లేదా ?

మరిన్ని వార్తలు