వార్నర్‌ భాయ్‌... మా గుండెల్ని పిండేశావ్‌ !

16 Jun, 2021 19:23 IST|Sakshi

తెలుగు మాటలే కాదు రాతల్లోనూ ఆకట్టుకున్న డేవిడ్‌ వార్నర్‌ 

నా రెండో ఇల్లు ఇండియా.. నాకిష్టమైన ఊరు హైదరాబాద్‌

అభిమానులను ఆకట్టుకుంటున్న వార్నర్‌ ఇన్‌స్టా పోస్ట్‌ 

హైదరాబాద్‌: అతను బ్యాట్‌ పట్టి మైదానంలో అడుగుపెడితే బౌండరీలు చిన్నబోతాయి. కెమెరా ముందుకు వస్తే ఇన్‌స్టాగ్రామ్‌ లైకుల లెక్కలు మిలియన్లను దాటేస్తాయి. ఆసీస్‌ క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గా,  సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా పరుగుల వరద పారించాడు. బహుబలి ప్రభాస్‌గా కత్తి పట్టినా పోకిరి మహేశ్‌లా కర్చీఫ్‌ చేతికి చుట్టినా అంతా డేవిడ్‌ వార్నర్‌కే చెల్లింది. 

తెలుగు పోస్ట్‌
సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గానే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలతో తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యాడు డేవిడ్‌ వార్నర్‌. తాజాగా తన రెండో ఇళ్లు ఇండియా అని, తనకు ఎంతో ఇష్టమైన నగరం హైదరాబాద్‌ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. మెసేజ్‌ అంతా ఇం‍గ్లీస్‌ ఆల్ఫాబెట్స్‌లో తెలుగులోనే రాశాడు. అందులో ప్రత్యేకించి భారతదేశం, హైదరాబాద్‌ పేర్లను మాత్రం అచ్చ తెలుగులో  రాశాడు డేవిడ్‌ వార్నర్‌

గుండెల్ని పిండేశావ్‌
హైదరాబాద్‌ హార్ట్‌ బీట్‌ డేవిడ్‌ అంటూ ఓ అభిమాని సంతోశం వ్యక్తం చేయగా, మరొకరు గుండెల్ని పిండేశావన్నా అంటూ మురిసిపోయారు. చాలా మంది మాత్రం....  వార్నర్‌ అన్నా .. లవ్‌ యూ అంటూ కామెంట్లు పోస్ట్‌ చేశారు. మరికొందరు వార్నర్‌ భాయ్‌ బిర్యానీ గుర్తుకువచ్చిందా అంటూ డేవిడ్‌ భాయ్‌ని అడిగారు. 

A post shared by David Warner (@davidwarner31)

చదవండి : అతని కోసం ఐపీఎల్‌ ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయి..

మరిన్ని వార్తలు