భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌, మ్యాచ్‌ టికెట్ల కోసం ధనవంతులు డబ్బులు చెల్లించరు!

19 Nov, 2023 11:57 IST|Sakshi

మరికొద్ది సేపట్లో జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్‌ హర్ష్‌ గోయెంక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ పోస్ట్‌పై ఓ వర్గానికి చెందిన క్రికెట్‌ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంతకి ఆ పోస్ట్‌లో ఏముందంటే?

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు లక్షల ఖర్చు చేసి మరీ మ్యాచ్‌ టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు నిర్వాహకులు ప్రముఖుల్ని ఆహ్వానిస్తుంటారు. వారికి ఉచితంగా పాస్‌లు అందజేస్తుంటారు. దీనిపై ఆర్‌పీజీ ఛైర్మన్‌ హర్ష్‌ గోయెంక్‌ తనదైన స్టైల్లో  స్పందించారు. 

వ్యాపార వేత్తలైనా తన స్నేహితులెవరూ మ్యాచ్‌ టికెట్లు కొనలేదని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఉచిత పాస్‌లు పొందారని తెలిపారు. పైగా ధనవంతులే డబ్బులు చెల్లించడానికి ఇష్టపడరని ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేయడం వివాదానికి దారి తీసింది.

దీనిపై ఓ వర్గం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజన్లు నేరుగా ఇంతకీ మీరు టికెట్లను కొనుగులో చేశారా? లేదంటా పాస్‌ తీసుకున్నారా? అని ప్రశ్నిస్తుండగా.. అందుకు తాను రెండూ తీసుకోలేదని చెప్పడం గమనార్హం. ఈ పోస్ట్‌పై కామెంట్లు వైరల్‌గా మారాయి.  


మ్యాచ్‌ టికెట్ల ధరలు ఎలా ఉన్నాయంటే?
ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ల ధరలు ఒక్కటి రూ. 1.87 లక్షల వరకు పెరిగాయి . క్రికెట్ వరల్డ్ కప్ టిక్కెట్ రీ-సెల్లింగ్ సైట్‌లోని వయాగోగో (viagogo.com) ధరల ప్రకారం, టైర్ 4లో టిక్కెట్ ధర రూ. 1,87,407 కాగా పక్కనే ఉన్న టైర్ టిక్కెట్ ధర రూ.1,57,421. సైట్‌లో అతి తక్కువ ధర టిక్కెట్ ధర రూ. 32,000 కంటే ఎక్కువగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు