చాట్‌జీపీటీపై మరో దిగ్గజ సంస్థ కన్ను.. త్వరలో అందుబాటులోకి

30 Jan, 2023 13:11 IST|Sakshi

కృత్రిమమేథలో (ఏఐ) సంచలనంగా మారిన చాట్‌జీపీటీపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి పెరుగుతోంది. తాజాగా చైనా సోషల్‌ మీడియా దిగ్గజం బైదూ.. ఓపెన్‌ ఏఐ సంస్థ తయారు చేసిన చాట్‌జీపీటీ తరహాలో కృత్తిమ చాట్‌బోట్‌ను అందుబాటులోకి తీసుకొని రావాలని యోచిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.    

చైనా అతిపెద్ద సెర్చ్ ఇంజన్ కంపెనీ బైదూ మార్చిలో చాట్‌జీపీటీ తరహాలో అప్లికేషన్‌ను ప్రారంభించనుంది. ప్రారంభంలో మొదట సెర్చ్‌ సర్వర్‌లలో ఈ లేటెస్ట్‌ టెక్నాలజీని ఇంటిగ్రేట్‌ చేయనుంది.  

పేరు ఖరారు చేయని చాట్‌బోట్‌.. చాట్‌ జీపీటీ తరహాలో పనిచేస్తుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో బ్లూమ్‌బెర్గ్ నివేదిక తర్వాత బైదూ కంపెనీ షేర్లు 5.8% వరకు పెరిగాయి. ఇది దాదాపు నాలుగు వారాల్లో అతిపెద్ద ఇంట్రాడే లాభాల్ని తెచ్చి పెట్టింది.  

బైదూ ఆన్‌లైన్ మార్కెటింగ్ నుండి ఏఐకి మారేందుకు మారేందుకు సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపింది. ఇందుకోసం బిలియన్‌ డాలర్లను వెచ్చింది. అనేక సంవత్సరాలుగా డేటాపై శిక్షణ పొందిన లార్జ్‌ స్కేల్‌ మెషీన్‌ లెర్నింగ్‌ మోడల్‌తో.. చాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు