Big Bazaar: బిగ్‌ బాస్కెట్‌, జియో మార్ట్‌లకు పోటీగా...బిగ్‌ బజార్‌ భారీ స్కెచ్‌..!

12 Jan, 2022 18:18 IST|Sakshi

కోవిడ్‌-19 రాకతో భారత్‌లో ఆన్‌లైన్‌ గ్రాసరీ డెలివరీ సేవలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి. ఈ సేవలను అందించడంలో బిగ్‌ బాస్కెట్‌, ఇన్‌స్టామార్ట్‌, బ్లిన్క్‌ఇట్‌(గ్రోఫర్స్‌), జియో మార్ట్‌ లాంటి కంపెనీలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. ఆన్‌లైన్‌ డెలివరీ సేవలను అందించడంలో ఫ్యుచర్‌ గ్రూప్‌కు చెందిన రిటైల్‌ చైన్‌ సంస్థ బిగ్‌ బజార్‌ భారీ ప్రణాళికలను సిద్ధమైన్నట్లు సమాచారం. 

బెంగళూరు కంపెనీతో భాగస్వామ్యం..!
బిగ్‌ బజార్‌ ఆయా నగరాల్లో రెండు గంటల్లో కస్టమర్లకు గ్రాసరీ సేవలను అందిస్తోంది. మరింత వేగవంతమైన ఆన్‌లైన్‌ గ్రాసరీ సేవలను అందించేందుకుగాను బెంగళూరుకు చెందిన ఈవెంట్ మార్కెటింగ్ టెక్నాలజీ స్టార్టప్ ఎర్సెస్ లైవ్ (Ercess Live)తో బిగ్‌ బజార్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య ఈ ఒప్పందం గత ఏడాది డిసెంబర్‌లోనే జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం..ఎర్సెస్‌ లైవ్‌ ఆన్‌లైన్‌ గ్రాసరీ సేవల్లో భాగంగా బిగ్‌ బజార్‌కు స్ట్రాటిజిక్‌ వ్యూహాలను అందించనున్నట్లు సమాచారం. ఈ నెల జనవరిలో ఆన్‌లైన్‌ గ్రాసరీ సేవలను బిగ్‌ బజార్‌ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా దక్షిణ భారత్‌లో తన కొత్త హోమ్ డెలివరీ సేవలను బిగ్ బజార్‌ ప్రారంభించనుంది. 

డంజోతో రిలయన్స్‌ భారీ డీల్‌..!
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ కిరాణా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసేందుకుగాను ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్‌ చైన్‌ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌  ఆన్‌లైన్‌ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోతో కలిసే పనిచేసేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. అందుకోసం డంజోలో 25.8 శాతం వాటాలను రిలయన్స్‌ కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 1,488 కోట్లు. డంజో భాగస్వామ్యంతో జియో మార్ట్‌, రిలయన్స్‌ రిటైల్‌ సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ గ్రాసరీ డెలివరీ సేవల్లో బిగ్‌ ప్లేయర్స్‌గా జియో మార్ట్‌, బిగ్‌ బాస్కెట్స్‌ ముందుస్థానంలో ఉన్నాయి.

చదవండి: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌..! వీటితో పాటుగా మరో 14 ఓటీటీ సేవలు ఉచితం..!

మరిన్ని వార్తలు