సహారా కస్టమర్లకు గుడ్‌న్యూస్‌: ఇన్వెస్టర్లకు చెల్లింపులు

30 Mar, 2023 18:52 IST|Sakshi

న్యూఢిల్లీ: సహారా గ్రూపునకు చెందిన నాలుగు కోపరేటివ్‌ (హౌసింగ్‌) సొసైటీల పరిధిలోని 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు, 9 నెలల్లోగా చెల్లింపులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సెబీ వద్ద ఎస్క్రో ఖాతాలో సహారా గ్రూప్‌ డిపాజిట్‌ చేసిన రూ.24,000 కోట్ల నిధుల నుంచి రూ.5,000 కోట్లను సెంట్రల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోపరేటివ్స్‌కు బదిలీ చేయాలంటూ జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

(ఇదీ చదవండి: మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ ​కార్డ్‌పై: రూ. కోటి దాకా కవరేజ్‌)

ఓ ప్రజాహిత వ్యాజ్యం విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు రిటైర్ట్‌ జడ్జి ఆర్‌ సుభాష్‌ రెడ్డి చెల్లింపుల ప్రక్రియను పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. పెద్ద ఎత్తున ప్రజల ప్రయోజనాలు ఇమిడి ఉండడంతో పిటిషనర్ల అభ్యర్థన సహేతుకంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చిందని కోపరేషన్‌ శాఖ ప్రకటన విడుదల చేసింది.    

(రెడ్‌మి 12సీ, రెడ్‌మి నోట్‌12 వచ్చేశాయ్‌! అందుబాటు ధరలే)

మరిన్ని వార్తలు