BMW R nineT & R 18: వందేళ్ల చరిత్రకు సాక్ష్యం.. లక్‌ ఉంటే ఈ బైక్‌ మీదే!

22 Feb, 2023 14:50 IST|Sakshi

భారతీయ మార్కెట్లో అనేక కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి, ఈ తరుణంలో ప్రముఖ లగ్జరీ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యు మోటొరాడ్ 100 సంవత్సరాల చరిత్రకు నిదర్శనంగా 'బిఎండబ్ల్యు ఆర్ 9టి 100 ఇయర్స్ & ఆర్ 18 100 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్' విడుదల చేసింది.

కంపెనీ విడుదల చేసిన ఈ 100 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్స్ ధరలు వరుసగా రూ.24 లక్షలు (ఆర్ 9టి 100 ఇయర్స్), రూ.25.90 లక్షలు (ఆర్ 18 100 ఇయర్స్). నిజానికి ఈ బైకులు 1923లో మొదటి సారి మార్కెట్లో విడుదలయ్యాయి. ఆ తరువాత సరిగ్గా 100 సంవత్సరాలకు లిమిటెడ్ ఎడిషన్స్ రూపంలో పుట్టుకొచ్చాయి. ఈ రెండు బైకులు లిమిటెడ్ ఎడిషన్స్ కాబట్టి ఒక్కొక్క మోడల్ కేవలం 1923 యూనిట్లను మాత్రమే తీసుకొస్తోంది.

బీఎండబ్ల్యు ఆర్ 9టి 100 ఇయర్స్ బైక్ రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ మాదిరిగా ఉంటుంది. ఇది ఎయిర్ కూల్డ్ 1,170 సీసీ ఫ్లాట్-ట్విన్ ఇంజన్‌ కలిగి 107.2 బీహెచ్‌పీ పవర్ 100.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఆర్ 18 క్రూయిజర్ మోటార్‌సైకిల్ మాదిరిగా ఉంటుంది, ఇది 1,802 సీసీ ఫ్లాట్-ట్విన్ ఇంజిన్ కలిగి 89.8 బిహెచ్‌పి పవర్, 158 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటాయి. 

100 ఇయర్స్ ఎడిషన్స్ కాబట్టి, పేరుకు తగ్గట్టుగానే బ్యాడ్జ్, క్రోమ్ మిక్స్డ్ ఫ్యూయెల్ ట్యాంక్, మిల్లింగ్ సిలిండర్ హెడ్ కవర్లు, ఇంజన్ హౌసింగ్ కవర్లు, సీట్ హోల్డర్లు, ఆయిల్ ఫిల్లర్ ప్లగ్, అడ్జస్టబుల్ హ్యాండ్ లివర్లు, ఫుట్‌పెగ్‌లు వంటివి ఇందులో చూడవచ్చు. ప్రత్యేకంగా ఈ బైక్ సీటును డ్యూయల్ టోన్ బ్లాక్  అండ్‌  ఆక్స్‌బ్లడ్ ఫినిషింగ్‌తో ఆకర్షణీయంగా  తీర్చిదిద్దింది.

ఆర్9టి బైకుతో పోలిస్తే ఆర్ 18 బైకులో తక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ ఉన్నాయి. ఇందులోని టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ చుట్టూ వైట్ కలర్‌లో ఉన్న డబుల్ పెయింట్ లైన్స్ చూడవచ్చు. డ్యూయెల్ కలర్ సీటు మీద 100 ఇయర్స్ బ్యాడ్జ్ ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా అక్రాపోవిక్ ఎగ్జాస్ట్, ఎల్ఈడీ హెడ్‌లైట్, హీటెడ్ గ్రిప్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఇందులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు