-

వారికి గుడ్ న్యూస్‌ 38 వేల ఉద్యోగాలు, గిరిజనులకు ప్రత్యేక మిషన్‌

1 Feb, 2023 12:58 IST|Sakshi

న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గుడ్‌న్యూస్‌ అందించారు. బ‌డ్జెట్‌లో ఏడు అంశాల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నట్టు వెల్లడించిన నిర్మలా సీతారామన్‌ విద్యకు తమ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు.  ఈ సందర్భంగా  ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనున్నట్టు తెలిపారు. 

ఏక‌ల‌వ్య స్కూళ్ల‌కు టీచ‌ర్లు, స‌పోర్ట్ స్టాఫ్‌ను రిక్రూట్ చేయ‌నున్నారు. రానున్న మూడేళ్ల‌లో ఈ స్కూళ్ల‌కు 38, 800 వేల మంది టీచ‌ర్ల‌ను,ఇత సహాయక సిబ్బందిని  రిక్రూట్ చేయ‌నున్న‌ట్లు మంత్రి  తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే దేశ‌వ్యాప్తంగా ఉన్న 740 ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌లో సుమారు 3.5 ల‌క్ష‌ల మంది గిరిజ‌న విద్యార్థులు విద్య‌ను అభ్య‌సిస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. 

2014 నుంచి ఏర్పాటైన 157 మెడికల్ కాలేజీలతో పాటు కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలను కేంద్రం ఏర్పాటు చే‍స్తామన్నారు. అలాగే గిరిజనుల పీవీటీజీ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు  లోక్‌స‌భ‌లో  వెల్లడించారు.  గిరిజనుల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి పీఎంపీ బీటీజీ  డెవలప్‌మెంట్ మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.  రానున్న 3 సంవత్సరాలలో ఈ పథకం అమలుకు రూ. 15,000 కోట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆమె వెల్లడించారు.

మరిన్ని వార్తలు