క్రెడిట్ కార్డులు ఇన్ని రకాలా..! ఇవెలా ఉపయోగపడతాయంటే..?

5 Dec, 2023 10:32 IST|Sakshi

భారతదేశంలో చాలా బ్యాంకులు (ప్రభుత్వ & ప్రైవేట్) తమ కస్టమర్లకు కేవలం డెబిట్ కార్డులు మాత్రమే కాకుండా.. క్రెడిట్ కార్డులను కూడా అందిస్తున్నాయి. ఈ కథనంలో ప్రస్తుతం మార్కెట్లో ఎన్ని రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి, వాటి ఫీచర్స్ ఏంటి? బెనిఫిట్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రెగ్యులర్ క్రెడిట్ కార్డులు
రెగ్యులర్ క్రెడిట్ కార్డులనేవి రివార్డ్ పాయింట్స్, ఫ్యూయెల్ సర్‌ఛార్జ్ మినహాయింపుల వంటి అదనపు సౌకర్యాలను అందిస్తాయి. జీవిత భాగస్వామి, పెద్ద పిల్లలు, తల్లిదండ్రులు, సోదరులు లేదా సోదరీమణులతో పంచుకోవడానికి మూడు ఫ్రీ యాడ్-ఆన్ కార్డ్‌లను కూడా పొందవచ్చు. ఇవి అన్ని విధాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్‌లు
ఈ కార్డ్‌లు మీకు ఫ్యాన్సీ లాంజ్‌లకు ఫ్రీ యాక్సెస్, గోల్ఫ్ ఫ్రీ రౌండ్‌లు, రివార్డ్‌లు, పెద్ద రెస్టారెంట్‌లలో కూల్ డిస్కౌంట్‌లు వంటి ప్రత్యేక సౌకర్యాలను అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలనుకునే వారికి ఇలాంటి కార్డులు ఉపయోగపడతాయి.

కో-బ్రాండెడ్ కార్డ్‌లు
కో-బ్రాండెడ్ కార్డ్‌లు కొన్ని రకాల అంశాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. విమాన టికెట్లు, ప్రయాణాల మీద కొన్ని డిస్కౌంట్స్, స్పెషల్ చెక్-ఇన్ కౌంటర్స్, ఎక్స్‌ట్రా లగేజీ అలవెన్స్, లాంజ్‌లకు ఫ్రీ యాక్సెస్ వంటి అద్భుతమైన సదుపాయాలు ఈ కార్డుల ద్వారా పొందవచ్చు.

కమర్షియల్ లేదా బిజినెస్ కార్డులు
మీ అవసరాల కోసం ఖర్చు చేసే సమయంలో కమర్షియల్ లేదా బిజినెస్ కార్డులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాపార పర్యటనలు, కొనుగోళ్ల సమయంలో డబ్బు ఆదా చేసుకోవడంలో ఇది మీకు చాలా సహాయపడుతుంది. మీ చెల్లింపులను సైతం సులభంగా ట్రాక్ చేయవచ్చు. వీటిలో అదనపు ప్రోత్సాహకాలను కూడా పొందవచ్చు.

ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డ్‌లు
ప్రీపెయిడ్ కార్డలనేవి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగపడతాయి. లిమిటెడ్ క్రెడిట్‌తో లభించే ఈ కార్డులు మీ పిల్లలకు కూడా ఇవ్వవచ్చు, వారు ఎంత ఖర్చు చేయాలో దీని ద్వారా నిర్దారించుకోవచ్చు. రోజువారీ ఖర్చులను కవర్ చేయడానికి కంపెనీలు కూడా ఇలాంటి కార్డులను ఉపయోగిస్తుంటాయి.

ఇదీ చదవండి: ఆ ఒక్క సలహా రోజుకి రూ.5 కోట్లు సంపాదించేలా.. భర్త సక్సెస్‌ వెనుక భార్య..

ప్రీమియం క్రెడిట్ కార్డులు
ఎక్కువ డబ్బు సంపాదించి, ఎక్కువ పనుల కోసం కారు పొందాలనుకునే వినియోగదారులు ఇలాంటి ప్రీమియం క్రెడిట్ కార్డులను పొందవచ్చు. మెరుగైన రివార్డ్స్, అదనపు ప్రయోజనాల కోసం కూడా ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి.

సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు
అత్యవసర సమయంలో క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగపడతాయి. క్రెడిట్ స్కోర్ ఎక్కువలేనివారు కూడా ఇలాంటి కార్డులను పొందవచ్చు. అయితే బిల్లులు సకాలంలో చెల్లిస్తామని బ్యాంకుకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సదరు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో జమ చేసిన డబ్బు క్రెడిట్ కార్డుకు కొలేటరల్‌గా పనిచేస్తుంది.

>
మరిన్ని వార్తలు