Actor Vishal: 'మిచౌంగ్‌' తుపాను.. ఆవేదనతో ఫైర్‌ అయిన విశాల్‌

5 Dec, 2023 07:44 IST|Sakshi

'మిచౌంగ్‌' తుపానుతో  తమిళనాడు రాజధాని చెన్నైలోని రోడ్లన్నీ చెరువును తలపిస్తున్నాయి. అన్ని ప్రాంతాలను వర్షపు నీరు చుట్టుముట్టింది. భారీ వర్షాలకు  జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ పరిస్థితిపై హీరో విశాల్‌ స్పందించారు. విపత్తు సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) విఫలమైందంటూ విశాల్‌ ఆరోపించారు. 

'డియర్‌ ప్రియా రాజన్‌ (చెన్నై మేయర్‌), జీసీసీ కమిషనర్‌, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులకు నేను చెప్ప దలుచుకున్నది ఏమిటంటే... మీ కుటుంబాలతో మీరు క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నాను. వరదల వల్ల వచ్చే నీరు మీ ఇళ్లలోకి రాదనుకుంటున్నా. ఇలాంటి సమయంలో మీకు మాత్రం నిరంతర విద్యుత్తు, ఆహారం ఉంటుంది. కానీ ఒక ఓటరుగా ఇదే నగరంలో నివసిస్తున్న మేమంతా అలాంటి పరిస్థితిలో లేము.

2015లో చెన్నైలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అప్పుడు వారందరికీ మేము సాయం చేశాం. కానీ ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఇప్పుడు అంతకు మించిన దారుణమైన పరిస్థితి కనిపించడం చాలా భాదగా ఉంది. అయినప్పటికీ ఈ సమయంలో కూడా మేము కచ్చితంగా ఆహారం, తాగునీరు, కనీస వసతి కల్పిస్తాము. ఇలాంటి సాయం చేస్తూనే ఉంటాం. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బయటకు రండి. బయటకు వచ్చి అవసరమైన సాయం చేసేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం.' అని పేర్కొన్నారు.

చదవండి: చెన్నైలో జలప్రళయం 

>
మరిన్ని వార్తలు