స్టాక్‌మార్కెట్‌లో అస్థిరత.. నష్టాల బాట పట్టిన సూచీలు

5 Oct, 2021 09:41 IST|Sakshi

ముంబై : పెరిగిన ముడి చమురు ధరలతో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లపై చమురు ధరల ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో దేశీ స్టాక్‌మార్కెట్‌లో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. నిన్న ఉదయం మార్కెట్‌ ప్రారంభం కావడంతోనే లాభాల బాట పట్టిన సూచీలు ఈ రోజు అడుగు ముందుకు వేసేందుకు మొరాయిస్తున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ స్వల్ప లాభాలతో మొదలై నష్టాల బాట పట్టగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నష్టాలతోనే ట్రేడ్‌ మొదలుపెట్టింది.  

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం 59,320 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ వెంటనే 59,560 పాయింట్లకు చేరకుంది. కానీ కాసేపటికే వరుసగా పాయింట్లు కోల్పోవడం ప్రారంభమైంది. ఉదయం 9:47 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 91 పాయింట్లు నష్టపోయి 59,207 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 17,682 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 

మారుతి సుజూకి ఇండియా, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పేయింట్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాలు పొందగా హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, టైటాన్‌ షేర్లు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు