సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

16 Nov, 2023 15:44 IST|Sakshi

ఈ రోజు (గురువారం) ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీ రెండూ లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 306.5 పాయింట్ల భారీ లాభంతో 65928.48 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 19762.50 వద్ద ముగిసాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ కంపెనీలు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ నష్టాల జాబితాలో చేరాయి. మొత్తానికి ఈ రోజు ఆటో మొబైల్ కంపెనీలు కొంత జోరు మీద ఉన్నట్లు తెలుస్తోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు