డ్రైవర్ అవసరం లేని డైమ్లర్స్ భారీ ట్రక్

21 May, 2021 14:57 IST|Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక ట్రక్, బస్సు తయారీదారు సంస్థ డైమ్లెర్ ఎజీ భవిష్యత్ లో హైడ్రోజన్, బ్యాటరీ సహాయంతో నడిచే భారీ ట్రక్ లను మార్కెట్లోకి తీసుకు రానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం జీరో ఎమిషన్ వాహనల తయారీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు లేనప్పటికీ డైమ్లెర్ ఎజీ ట్రక్ డివిజన్ 2025 నాటికి ఎక్కువ శాతం పర్యావరణ హిత వాహనాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఈ దశాబ్దం తర్వాత బ్యాటరీ, హైడ్రోజన్ శక్తితో పనిచేసే అతి పెద్ద వాహనాలు డీజిల్‌తో నడిచే వాహనలతో పోటీ పడతాయని కంపెనీ అంచనా వేసింది.

అతిపెద్ద వాహనాలను బ్యాటరీలతో నడిచే విధంగా రూపోదించడానికి అయ్యే ఖర్చు భారీగా ఉందని, అలాగే సాంకేతికత పరంగా మరిన్ని మార్పులు చోటు చేసుకోవాలని డైమ్లెర్ ట్రక్ సీఈఓ మార్టిన్ డామ్ చెప్పారు. డైమ్లెర్ ఏజీ ట్రక్ ఈ ఏడాది చివరి నాటికి తన సహా బ్రాండ్‌లైన ఫ్రైట్‌లైనర్, మెర్సిడెస్ బెంజ్‌ నుంచి స్వతంత్ర సంస్థగా మారిన తర్వాత పర్యావరణ హిత వాహనాల అభివృద్ది కోసం వ్యూహ రచన చేస్తున్నట్లు డామ్ తెలిపారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రియాస్ గోర్బాచ్ 2025 నాటికి కంపెనీ బ్యాటరీ, హైడ్రోజన్ వాహనాల తయారీ కోసం ప్రణాళికలు రూపోదించినట్లు చెప్పారు. 2025 తర్వాత బ్యాటరీతో నడిచే వాహనాల ధర డీజిల్‌తో నడిచే వాహనాల ధరతో సమానంగా ఉంటుందని ఆయన ఊహించారు. ఈ దశాబ్దం చివరి నాటికి డ్రైవరు అవసరం లేని అతిపెద్ద ట్రక్ లను కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

చదవండి:

ఎయిర్‌టెల్‌: సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయ్‌..

మరిన్ని వార్తలు