భారత్‌ మార్కెట్లోకి లోటస్‌ లగ్జరీ కార్లు

10 Nov, 2023 04:28 IST|Sakshi

ధర రూ. 2.55 కోట్ల నుంచి ప్రారంభం

న్యూఢిల్లీ: బ్రిటన్‌ లగ్జరీ స్పోర్ట్స్‌ కార్ల బ్రాండు లోటస్‌ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తొలుత ఎలక్ట్రిక్‌ ’ఎలెటర్‌ ఆర్‌’ ఎస్‌యూవీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇందులో మూడు వెర్షన్స్‌ ఉంటాయి. ధర రూ. 2.55 కోట్ల నుంచి రూ. 2.99 కోట్ల (దేశవ్యాప్తంగా ఎక్స్‌షోరూమ్‌) వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 265 కి.మీ.గా ఉంటుంది. 2.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని (గంటకు) అందుకోగలదు.

ఒకసారి చార్జి చేస్తే ఈ ఫైవ్‌–సీటరు వాహనంలో గరిష్టంగా 600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది సంప్రదాయ ఇంధనాలతో నడిచే ఎమిరా స్పోర్ట్స్‌ కారును కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. లోటస్‌ కార్స్‌కు భారత్‌లో అ«దీకృత సంస్థగా ఎక్స్‌క్లూజివ్‌ మోటర్స్‌ వ్యవహరిస్తుంది. లోటస్‌ కార్లు అధునాతన టెక్నాలజీతో అసమాన అనుభూతిని అందిస్తాయని ఎక్స్‌క్లూజివ్‌ మోటర్స్‌ ఎండీ సత్య బాగ్లా తెలిపారు.

మరిన్ని వార్తలు