Diwali Discounts: కార్ల కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ - ఏకంగా రూ.3 లక్షలు!

12 Nov, 2023 18:14 IST|Sakshi

దీపావళి పండుగ సందర్భంగా కంపెనీలు మంచి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందిస్తాయని చాలామంది కొత్త కారు కొనాలనుకుంటారు. అనుకున్న విధంగానే కొన్ని కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద లక్షల డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఈ కథనంలో ఏ కంపెనీ.. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది? వివరాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం.

మహీంద్రా ఎక్స్‌యూవీ400
దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ పండుగ సీజన్‌లో తన 'ఎక్స్‌యూవీ400' ఎలక్ట్రిక్ కారు మీద ఏకంగా రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంతే కాకుండా కంపెనీ ఈ కారు కొనుగోలుపైన 5 సంవత్సరాల పాటు ఫ్రీ ఇన్సూరెన్స్, ఫ్రీ ఛార్జింగ్ కాండీ సదుపాయాలను అందిస్తుంది. ఎక్స్‌యూవీ400 ధరలు రూ. 15.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్
హ్యుందాయ్ కంపెనీ తన 'కోనా' ఎలక్ట్రిక్ కారు కొనుగోలు మీద దీపావళి సందర్భంగా రూ. 2 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 23.84 లక్షలు. అయితే ఈ పండుగ సందర్భంగా కొనుగోలు చేస్తే రూ. 2 లక్షల తగ్గింపు లభిస్తుంది.

సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్‌
ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ దీపావళి సందర్భంగా తన 'సీ5 ఎయిర్‌క్రాస్‌' SUV మీద రూ. 2 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 36.91 లక్షలు (ఎక్స్ షోరూమ్).

స్కోడా కుషాక్
దీపావళి పండుగ సందర్భంగా స్కోడా కంపెనీ తన కుషాక్ కారు మీద రూ. 1.5 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. దేశీయ విఫణిలో స్కోడా కుషాక్ ప్రారంభ ధర రూ. 10.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఆఫర్ ఈ నెలలో కొనుగోలు చేసేవారికి మాత్రమే లభిస్తుంది. ఆ తరువాత బహుశా అందుబాటులో ఉండే అవకాశం ఉండకపోవచ్చు.

ఇదీ చదవండి: ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఇండియన్ - వీడియో వైరల్

ఎంజీ ఆస్టర్
మోరిస్ గ్యారేజ్ కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఆస్టర్ కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు రూ. 1.75 లక్షల తగ్గింపు అందిస్తోంది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 10.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ పర్ఫామెన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కారణంగానే ఎక్కువమంది ఈ కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

మరిన్ని వార్తలు