పండుగపూట పడిపోయిన పసిడి.. స్థిరంగా వెండి - కొత్త ధరలు ఇలా!

12 Nov, 2023 16:09 IST|Sakshi

భారతీయ మార్కెట్లో దసరా సందర్భంగా భారీగా పెరిగిన పసిడి ధరలు దీపావళి సమయంలో కొంత తగ్గుముఖం పట్టాయి. నేడు బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5554, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6059గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 55540, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 60590గా ఉంది. నిన్నటి కంటే ఈ రోజు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.

చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధరలు రూ. 5599 (22 క్యారెట్స్), రూ. 6108 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 55990, రూ. 61080గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 10 (22 క్యారెట్స్), రూ. 10 (24 క్యారెట్స్) మాత్రమే తగ్గింది.

ఇదీ చదవండి: రెజ్యూమ్‌ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే!

ఢిల్లీలో ఈ రోజు ఒక గ్రాము 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5569, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6069గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 10 (22 క్యారెట్స్), రూ. 60 (24 క్యారెట్స్) తగ్గి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55690, రూ. 60690కి చేరింది. వెండి ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో కూడా స్థిరంగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు