వరుస దెబ్బలు, టెస్లా షేర్లను మళ్లీ అమ్మేసిన ఎలాన్ మస్క్!

10 Aug, 2022 10:52 IST|Sakshi

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆస్తులు మంచులా కరిగిపోతున్నాయి. ఇప్పటికే మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విట్టర్‌పై న్యాయ పరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఈ జులై నెలలో  బిలియన్‌ డాలర్ల ఖరీదైన షేర్లను అమ్మారు. తాజాగా మరోసారి ఎలాన్‌ మస్క్‌ తన షేర్లను అమ్మేసినట్లు తెలుస్తోంది.  

ఎలాన్‌ మస్క్‌ 6.9 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. 44 బిలియన్ల డాలర్ల డీల్‌ అంశంలో ట్విట్టర్‌తో న్యాయ పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో టెస్లా స్టాక్స్‌ అమ్మడం చాలా ముఖ్యం అంటూ ట్వీట్‌ చేశారు. మున్ముందు టెస్లా షేర్లను అమ్మే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఈ ఏడాది ఆగస్ట్‌ 5 నుంచి ఆగస్ట్‌ 9 వరకు మొత్తం 7.9 మిలియన్‌ షేర్లను అమ్మేసినట్లు సెక్యూరిటీ అండ్‌ ఎక్ఛేంజ్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో పేర్కొంది. కాగా, ఈ జులై నెలలో మస్క్‌ 8.5 బిలియన్‌ డాలర్ల ఖరీదైన షేర్లను అమ్మేశారు. తాజాగా 6.7 బిలియన్‌ డాలర్ల టెస్లా షేర్లను సేల్‌ చేయడం సంచలనంగా మారింది.

>
మరిన్ని వార్తలు