భారీ కాంట్రాక్ట్‌, ఎలాన్‌ మస్క్‌కు జాక్‌ పాట్‌!

1 Sep, 2022 21:48 IST|Sakshi

స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ జాక్‌ పాట్‌ కొట్టారు. నాసా నుంచి 1.4 బిలియన్‌ డాలర్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నారు. ఈ కాంట్రాక్ట్‌ ఒప్పందంలో భాగంగా  మస్క్‌  ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఆస్ట్రోనాట్స్‌ను ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌) కు పంపించనున్నారు. 

కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆస్ట్రోనాట్స్‌ను తరలించేందుకు మస్క్‌కు కాంట్రాక్ట్‌ ఇచ్చినట్లు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా  తెలిపింది. 

తొలిసారి 2014 లో నాసా మస్క్‌తో  ఒప్పందం కుదర్చుకుంది. ఆ ఒప్పందాన్ని తాజాగా సవరించింది. తాజాగా సవరించిన ఒప్పందంలో భాగంగా స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్, ఫాల్కన్ 9 రాకెట్లు కార్గోను, నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు సిద్ధంగా ఉన్నాయని నాసా తెలిపింది.

మరిన్ని వార్తలు