ఫ్యాబ్‌ ఇండియా బంపరాఫర్‌..వారికి 7 లక్షల షేర్లు ఉచితం..!

24 Jan, 2022 02:33 IST|Sakshi

త్వరలో రూ.4,000 కోట్ల ఐపీవో

న్యూఢిల్లీ: లైఫ్‌స్టయిల్‌ రిటైల్‌ దుకాణాల సంస్థ ‘ఫ్యాబ్‌ ఇండియా’ కళాకారులకు సముచిత గౌరవం ఇవ్వనుంది. త్వరలో ఈ సంస్థ రూ.4,000 కోట్ల నిధుల సమీకరణకు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో)ను చేపట్టనుంది. దీంతో 7 లక్షల షేర్లను కళాకారులకు (చేతి వృత్తుల వారు), రైతులకు ఉచితంగా ఇవ్వాల ని నిర్ణయించింది. ఐపీవోకు సంబంధించి ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) ఈ సంస్థ సెబీ వద్ద శనివారం దాఖలు చేసింది.

రూ.500 కోట్ల తాజా ఇష్యూతోపాటు.. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌/ప్రస్తుత వాటాదారులు) రూపంలో 2,50,50,543 షేర్లను విక్రయించనుంది. ‘‘కంపెనీ, కంపెనీ అనుబంధ సంస్థలతో అనుబంధం కలిగిన కళాకారులు, రైతులను గౌరవించడంతోపాటు, వారికి ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫ్యాబ్‌ ఇండియా ప్రమోటర్లు బిమ్లానంద బిస్సెల్‌ 4,00,000 షేర్లు, మధుకర్‌ ఖేరా 3,75,080 షేర్లను కళాకారులకు డీఆర్‌హెచ్‌పీ దాఖలు తర్వాత బదిలీ చేయనున్నారు’’ అంటూ కంపెనీ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు