పీఎం ముద్రా లోన్‌ కింద లక్ష రూపాయల రుణమా? నిజమా? 

31 Jan, 2023 18:25 IST|Sakshi

సాక్షి, ముంబై:  సోషల్‌మీడియా వచ్చిన  తరువాత  అబద్దాలు,  తప్పుడు వార్తలు, ఫేక్‌ న్యూస్‌ విస్తరణ బాగా పెరిగింది. వీటి పట్ల అప్రమత్తంగా ఉంటూ నిజానిజాలను ఫ్యాక్ట్‌ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తాజాగా  ముద్రా లోన్‌   స్కీం కింద లక్ష రూపాయల రుణం వస్తోందంటూ ఒక వార్త హల్‌చల్‌ చేస్తోంది.దీనిపై పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ రిపోర్ట్‌ను ట్వీట్‌ చేసింది. 

ప్రధాన మంత్రి ముద్రా లోన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం గురించిన లేఖ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. దీని ప్రకారం లోన్ అగ్రిమెంట్ ఫీజులో రూ. 1,750కి బదులుగా  రూ. 1,00,000 రుణం అందింస్తోంది.  ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి వచ్చినదని, ఎన్‌ఆర్‌ఐ ఫండింగ్ స్కీమ్  కింద వడ్డీ రేటు 5 శాతం ఉంటుందని పేర్కొంది. అంతేకాదు పాక్షిక చెల్లింపులకు ఎటువంటి రుసుము ఉండదంటూ ఒక నకిలీ లేఖ  వైరల్‌ అయింది.

అయితే ఈ లేఖను ఫ్యాక్ట్ చెక్ చేసి, పూర్తిగా నకిలీదని పీఐబీ తేల్చి చెప్పింది.  కేంద్ర ప్రభుత్వం అటువంటి సాయాన్ని  దేన్నీ ప్రకటించలేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి లేఖను జారీ చేయ లేదని,  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న లేఖ నకీలీదంటూ ట్వీట్‌ చేసింది.
 

మరిన్ని వార్తలు