దేశవ్యాప్తంగా ఫ్రాంక్లిన్‌ ఈవీ 

11 Jan, 2023 03:03 IST|Sakshi
కోరోతో నవీన్, రంజిత్‌ (కుడి)  

రూ.50 కోట్లతో కంపెనీ విస్తరణ 

డిసెంబర్‌కల్లా 200 షోరూంలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ కంపెనీ ఫ్రాంక్లిన్‌ ఈవీ దేశవ్యాప్తంగా డిసెంబర్‌కల్లా 200 షోరూంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కంపెనీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ తదితర 30 నగరాల్లో 54 షోరూంలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోనే 14 షోరూంలు ఉన్నాయి. 2021లో అమ్మకాలను ప్రారంభించి రెండేళ్లలోనే 6,000 పైచిలుకు కస్టమర్లకు చేరువయ్యామని ఫ్రాంక్లిన్‌ ఈవీ ఫౌండర్‌ డాక్టర్‌ శశిధర్‌ కుమార్‌ మంగళవారమిక్కడ తెలిపారు.  

నెలకు 3,000 యూనిట్లు.. 
కొత్తగా ఫ్రాంచైజీ కోసం 30 మంది ఔత్సాహికులతో చర్చలు జరుగుతున్నాయని కో–ఫౌండర్‌ రంజిత్‌ కుమార్‌ తెలిపారు. ‘నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్రికాకు ఎగుమతులు చేస్తున్నాం. ఇతర దేశాల్లో అడుగు పెడతాం. 2023 చివరికల్లా నెలకు 3,000 యూనిట్ల అమ్మకాల స్థాయికి చేరాలన్నది లక్ష్యం. ఇందుకు రూ.50 కోట్లతో విస్తరణ చేపడుతున్నాం. కంపెనీలో పెట్టుబడికి ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. హైదరాబాద్‌లో ప్లాంటు ఉంది’ అని చెప్పారు.  

తొలి డ్యూయల్‌ బ్యాటరీ.. 
కోరో మోడల్‌కు  డి మాండ్‌ బాగుందని కో–ఫౌండర్‌ నవీన్‌ కుమార్‌ తెలిపారు.  ‘దక్షిణాదిన రిమూవ బుల్‌ డ్యూయల్‌ బ్యా టరీతో తయారైన తొలి మోడల్‌ ఇదే. ఒకసారి చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పవర్‌ ప్లస్, నిక్స్‌ డీలక్స్‌ మోడళ్లు సైతం మార్కెట్లో ఉన్నాయి. ఏప్రిల్‌కల్లా మరో 2 స్కూటర్లను ప్రవేశపెడతాం. కస్టమర్ల ఇంటి వద్దే సరీ్వస్‌ అందిస్తున్నాం. 2.1–3 కిలోవాట్‌ లిథియం అయాన్, లిథియం ఫాస్ఫేట్‌ రిమూవబుల్‌ బ్యాటరీలను  పొందుపరిచాం. వీటికి ఐక్యాట్‌–ఏఐఎస్‌ 156, బీఐఎస్, సీఈ, ఐఎస్‌వో, ఆర్‌వోహెచ్‌ఎస్‌ ధ్రువీకరణ ఉంది. ధర రూ.75 వేల నుంచి ప్రారంభం’ అని  చెప్పారు.

మరిన్ని వార్తలు