వృద్ధికి కార్పొరేట్‌ పెట్టుబడుల దన్ను

21 Feb, 2024 08:13 IST|Sakshi

ముంబై: కార్పొరేట్‌ రంగం తాజా మూలధన వ్యయాలు తదుపరి దశ వృద్ధికి దోహదపడే అవకాశం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఎకానమీ’ శీర్షికన రూపొందించిన  తాజా బులెటిన్‌ పేర్కొంది.  స్థిరంగా, 4 శాతం వద్ద తక్కువ ద్రవ్యోల్బణం జీడీపీ పురోగమనానికి కీలక అంశంగా  ఉంటుందని వివరించింది. 2024లో గ్లోబల్‌ ఎకానమీ ఊహించిన దానికంటే బలమైన వృద్ధిని ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొంది.  సవాళ్లు ఉన్నప్పటికీ, సానుకూలతలో వాటిని సమతౌల్యం చేస్తున్నట్లు వివరించింది. 

భారత ఆరి్థక వ్యవస్థ 2023–24 ప్రథమార్థంలో మంచి పురోగతి సాధించిందని, ఇదే ధోరణిని ఇప్పటికీ కొనసాగిస్తోందని పేర్కొంది. మొత్తంమీద, ప్రైవేట్‌ కార్పొరేట్‌ రంగం పెట్టుబడి ధోరణులు ఈ సంవత్సరం ఇప్పటివరకు సానుకూలంగా ఉన్నాయని తెలిపింది. 2023 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో ప్రధాన బ్యాంకులు, ఆరి్థక సంస్థలు (ఎఫ్‌ఐ) రుణాలు మంజూరు చేసిన ప్రాజెక్ట్‌ల మొత్తం వ్యయం రూ. 2.4 లక్షల కోట్లని పేర్కొంటూ, ఇది వార్షికంగా 23 శాతంకంటే ఎక్కువని తెలిపింది. 

ప్రస్తుత ఆరి్థక సంవత్సరం రెండవ, మూడవ త్రైమాసికాల్లో మూలదన పెట్టుబడులు, పబ్లిక్‌ ఆఫర్‌లు, వాణిజ్య రుణ సేకరణలు.. ఎకానమీ సానుకూలతలను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం వార్షిక సగటును 4.5 శాతంగా పేర్కొంది. బులెటిన్‌ కథనంలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు సంబంధిత రచయితలవితప్ప భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ అభిప్రాయాలుగా భావించరాదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ బులెటిన్‌ను రూపొందించింది.  

భారత్‌ రుణ–జీడీపీ నిష్పత్తిపై ఐఎంఎఫ్‌ వాదనలు సరికాదు... 
ఇదిలావుండగా,  ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన మరో ఆరి్టకల్‌ భారత్‌ రుణ–జీడీపీ నిష్పత్తిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అభిప్రాయాలను త్రోసిపుచి్చంది. రుణ–జీడీపీ నిష్పత్తి అంచనా వేసిన దానికంటే గణనీయంగా తక్కువగా ఉండవచ్చని ఉద్ఘాటించింది. ‘‘ఈ సందర్భంలో తీవ్ర పరిస్థితులు ఏదైనా సంభవిస్తే... భారతదేశ సాధారణ ప్రభుత్వ రుణం జీడీపీలో మధ్య కాలికంగా 100 శాతం మించిపోతుందన్న ఐఎంఎఫ్‌ వాదనను మేము తిరస్కరిస్తున్నాము’’ అని ఆర్టికర్‌ పేర్కొంది. 

2030–31 నాటికి ప్రభుత్వ సాధారణ రుణ–జీడీపీ నిష్పత్తి 78.2 శాతం ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనావేయగా, ఐదు శాతం తక్కువగా 73.4 శాతానికి పరిమితం అవుతుందని ఆర్టికల్‌ పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్‌ పటిష్ట రీతిలో కట్టడి చేయగలుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 

2024–25లో వృద్ధి 7 శాతం: ఆరి్థకశాఖ 
కాగా, భారత ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్‌ ప్రకాశవంతంగా’ కనిపిస్తుందని,  స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు  వచ్చే ఆరి్థక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని ఆరి్థకశాఖ నెలవారీ ఆరి్థక సమీక్షా నివేదిక పేర్కొంది.  భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు– అంతర్జాతీయ ఆరి్థక మార్కెట్లలో అస్థిరత నుండి ప్రతికూలతలపై దేశం నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని నివేదిక ఉద్ఘాటించింది. గృహ వినియోగం మెరుగుపడుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రైవేటు రంగంలో తిరిగి పెరుగుతున్న పెట్టుబడులు, మెరుగైన వ్యాపార సెంటిమెంట్‌లు, బ్యాంకులు– కార్పొరేట్‌ల ఆరోగ్యకరమైన బ్యాలెన్స్‌ షీట్‌లు, మూలధన వ్యయం పెంపునకు ప్రభుత్వ నిరంతర ప్రయత్నం ఎకానమీని సుస్థిరంగా నడుపుతోందని నివేదిక పేర్కొంది. ప్రపంచ వాణిజ్యం మెరుగుపడ్డం, సరఫరాల చైన్‌ స్థిరీకరణ అంతర్జాతీయ డిమాండ్‌ పురోగమనానికి దారితీసే అంశాలని వివరించింది.

whatsapp channel

మరిన్ని వార్తలు